కాంగ్రెస్‌ వల్లే సీఎం అయిన కేసీఆర్‌

Congress Leader Addanki Dayakar Fires On CM KCR - Sakshi

 టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌

నల్గొండ జిల్లా / శాలిగౌరారం (తుంగతుర్తి) : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాడని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పలువురు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ త్యాగంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. 

తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్‌ ‘తల్లిపాలుతాగి రొమ్ము గుద్దినట్లు’ వ్యవహరించాడని విమర్శించారు. నాడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే కేసీఆర్‌ ‘మరణదీక్ష’ చేసినా తెలంగాణ వచ్చేది కాదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే టీఆర్‌ఎస్‌కు భయమేస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మురారిశెట్టి కృష్ణమూర్తి, అన్నెబోయిన సుధాకర్, బండపల్లి కొమరయ్య, బండారు మల్లయ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, చింత ధనుంజయ్య, షేక్‌ ఇంతియాజ్, నోముల విజయ్‌కుమార్, కడమంచి వెంకటయ్య, బొమ్మగాని రవి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top