నాగార్జున సాగర్‌ గేట్లు మూసివేత | Closure Of Nagarjuna Sagar Dam Gates | Sakshi
Sakshi News home page

నాగార్జున సాగర్‌ గేట్లు మూసివేత

Sep 22 2019 11:47 AM | Updated on Sep 22 2019 11:56 AM

Closure Of Nagarjuna Sagar Dam Gates - Sakshi

సాక్షి, నల్గొండ: వరద నీరు తగ్గడంతో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. డ్యామ్‌లో ఇన్‌ఫ్లో,ఔట్‌ ఫ్లో 48,990 క్యూసెక్కులుగా నమోదయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.50 అడుగులుగా కొనసాగుతోంది.

సుందిళ్ల బ్యారేజీ రెండు గేట్లు ఎత్తివేత.. 
పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీ రెండు గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో,ఔట్‌ఫ్లో 1000 క్యూసెక్కులుగా నమోదయింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 8.83 కాగా, ప్రస్తుతం 7.24 టీఎంసీలుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 10,296 క్యూసెక్కులుగా ఉంది.పూర్తిస్థాయి నీటి నిల్వ 20.175 కాగా, ప్రస్తుతం 18.563 టీఎంసీలుగా ఉంది.

శ్రీరాంసాగర్‌ జలాశయానికి కొనసాగుతున్న వరద..
నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ప్లో 84,738 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 634 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1079.10 అడుగులుగా కొనసాగుతోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement