చిన్నారిపై లైంగికదాడికియత్నం | Child sexual assault attempt | Sakshi
Sakshi News home page

చిన్నారిపై లైంగికదాడికియత్నం

Mar 15 2016 2:48 AM | Updated on Jul 23 2018 9:13 PM

చిన్నారిపై లైంగికదాడికియత్నం - Sakshi

చిన్నారిపై లైంగికదాడికియత్నం

మండలంలోని తంగళ్లపల్లికి చెందిన ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించాడు.

 సిరిసిల్ల రూరల్ :  మండలంలోని తంగళ్లపల్లికి చెందిన ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గ్రామానికి చెందిన క్యారం కిషన్(40) రేగుపండ్లు, బజ్జీలు ఇస్తానని తన ఇంటి సమీపంలోని చిన్నారిని ఆదివారం సాయంత్రం ఇంట్లోకి తీసుకెళ్లాడు. బట్టలు విప్పి వికృతంగా ప్రవర్తించడంతో చిన్నారి రోదించింది. బాలిక ఏడుపు విన్న తల్లిదండ్రులు వెంటనే వచ్చి నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

కిషన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వివరాలు తెలిపారు. నిందితుడు సిరిసిల్లలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడని, గొడవల కారణంగా అతడి భార్య దూరంగా ఉంటోందని పేర్కొన్నారు. కిషన్‌పై సెక్షన్ 376 రెడ్‌విత్ 511 నమోదు చేసి లైంగిక వేధింపుల చట్టం ప్రయోగించారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement