ఈ నెల 19న ‘చలో ఉస్మానియా’  

Chalo Usmania Program Held On 19th Of This Month Under - Sakshi

పోస్టర్‌ ఆవిష్కరించిన కోదండరాం   

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న నిర్వహించనున్న ‘చలో ఉస్మానియా’ సత్యాగ్రహ పోస్టర్‌ను శనివారం టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో 48 లక్షలకు మందికిపైగా నిరుద్యోగులుంటే ప్రభుత్వం కేవలం 37 వేల పోస్టులే భర్తీ చేసిందన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షకు నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top