కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం రంగారెడ్డి జిల్లలో పర్యటించింది.
ఇబ్రహీంపట్నంలో కరువు బృందం పర్యటన
Dec 8 2015 11:31 AM | Updated on Mar 28 2018 11:26 AM
ఇబ్రహింపట్నం : కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం రంగారెడ్డి జిల్లలో పర్యటించింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం లో మంగళవారం పర్యటించిన బృందం పెద్ద చెరువు ప్రాంతాన్ని పరిశీలించి కరువుపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు.
అనంతరం గండిపేట చెరువును పరిశీలిస్తారు. చెరువు అలుగు మట్టం వివరాలు, గతంలో పరిస్థితిని అధికారులను అడిగి వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత మొయినాబాద్ మండలం కేసారం గ్రామంలో పత్తి పంటను పరిశీలించి రైతులతో మాట్లడతారు. అక్కడి నుంచి పరిగి మండలంలోని పత్తి పంటను, వికారాబాద్ లోని శివసాగర్ చెరువు పరిస్థితిని సమీక్షిస్తారు.
Advertisement
Advertisement