కాలి బూడిదైన సెల్​ టవర్​ | Cell tower catches fire in Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో దగ్దమైన సెల్‌ టవర్‌

Dec 21 2019 4:19 PM | Updated on Dec 21 2019 4:33 PM

Cell tower catches fire in Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ఓ భవనంపై ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి దగ్ధమైన సంఘటన నిజామాబాద్‌లో శనివారం చోటుచేసుకుంది. గాజులుపేటకు చెందిన నరసింహారావు నివాసంపై సెల్‌ టవర్‌ ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచి కరెంట్‌ లేకపోవడంతో సిబ్బంది జనరేటర్‌ వేశారు. అయితే  షార్ట్ సర్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెల్‌టవర్‌ కోసం ఏర్పాటు చేసిన గదిలోని సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యింది. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగలు అలుముకున్నాయి.

ఒక్కసారిగా సెల్‌ టవర్‌ అంటుకోవడంతో ఇంటి యజమానితో పాటు, ఆ భవనంలో అద్దెకు ఉంటున్నవారు భయంతో పరుగులు తీశారు. మరోవైపు సెల్‌ టవర్‌ అంటుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.  కాగా జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌ను తొలగించాలంటూ స్థానికులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement