‘కోడ్‌ ’ దాటితే వేటే..!

Candidates Brake Election Rules Police Will Punish - Sakshi

ఎన్నికల్లో జాగ్రత్తలు తప్పనిసరి

నిబంధనలు అతిక్రమిస్తే 

అభ్యర్థులకు ఇబ్బందే ... 

 ఎన్నికల కమిషన్‌తో పాటు పోలీసుల నిఘా 

సాక్షి, నల్లగొండ: ఎన్నికల నోటిఫికేషన్‌ వెలుబడింది. నియోజకవర్గ కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభ మైయింది. అయితే బరిలో దిగనున్న పార్టీ అభ్యర్థులు పాటించాల్సిన నియమావళిని ఎన్నికల సంఘం విడుదల చేసింది. నింబధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన నిబంధనలు ఇలా..
-   నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో రిట ర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి వంద మీటర్ల పరిధిలో మూడు వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థితో పాటు మరో ఐదుగురు మాత్రమే ఎన్నికల అధికారి గదిలోకి వెళ్లేం దుకు అనుమతి ఉంటుంది. ఏజెంట్‌ మరో వ్యక్తి లాయర్‌ను తీసుకు వెళ్లడానికి  అవకాశం ఇస్తారు. 
 - ప్రచార వాహనాకి రిటర్నింగ్‌ అధికారి అనుమతి తీసుకోవాలి. అనుమతి పత్రన్ని వాహనానికి స్పష్టంగా కనబడేలా అతికించాలి. పర్మిట్‌ మీద అభ్యర్థి పేరు, వాహనం నంబర్‌ వివరాలు ఉండాలి. ఫర్మిట్‌వాహనం అదే అభ్యర్థికి తప్ప మరే అభ్యర్థికి వాడరాదు. 
- విద్యా సంస్థల మైదానాలను వారి ప్రచారానికి వాడరాదు. 
- ప్రైవేట్‌ భూములు, వారి భవనాలు యజమానుల లిఖిత పూర్వక అనుమతి తీసుకుని రిటర్నింగ్‌ అధికారికి అందించిన తర్వాత వాల్‌పోస్టల్స్‌ అతికించాలి. 
- కరపత్రంపై ప్రింటిగ్‌ ప్రస్‌ పేరుతో ముద్రించాలి. 
- పార్టీ ప్రచారంలో భాగంగా ఓటర్లకు టోపీలు, జెండాలు, కండువాలు ఇవ్వవచ్చు. వీటిని ఎన్నికల ఖర్చులో చూపించ వలసి ఉంటుంది. కానీ చొక్కాలు పంపిణీకి వీలు లేదు. 
- దేవుళ్ల ఫొటోలు ,అభ్యర్థుల ఫొటోలతో  డైరీలు, క్యాలెండర్లు ముద్రించ కూడదు. 
- మంత్రులు ఎన్నికల అధికారులను పిలవడానికి వీలు లేదు. ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన మంత్రిని ఏ అధికారి కలవ కూడదు. 
- పైలెట్‌ కార్లు, బుగ్గ కార్లు ఉపయోగించ వద్దు. 

- అధికార పార్టీ చేసిన పనుల తెలిపే ప్రభుత్వ ప్రచార హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఉండవద్దు.
- గతంలో మొదలు పెట్టిన పనులు కొనసాగించ వచ్చు. 

- పకృతి వైఫరిత్యాలు వస్తే సహాయ కార్యక్రమాల్లో  మంత్రి పాల్గనవచ్చు. కానీ రాజకీయ ప్రచారం చేయవద్దు. 
పార్టీ కార్యాలయం ఏర్పాటుకు....
- పాఠశాలలకు, పోలింగ్‌ స్టేషన్లకు,ప్రార్థన స్థలలకు 200 మీటర్ల లోపు పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయరాదు. 
- ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత నియోజక వర్గంలో ఓటర్లు కాని వారు ఉండవద్దు.
- రాత్రి 10 గంటల తర్వాత నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు, లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించరాదు. రాత్రి  10 గంటల తర్వాత  పబ్లిక్‌ మీటింగ్‌లు నిర్వహించ కూడదు. 
- పోలింగ్‌ ఏజెంట్‌ అదే పోలింగ్‌  కేంద్రంలో ఓటరై  ఉండాలి. ఫొటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డు ఉంగాలి. 
- ఎస్‌ఎంఎస్‌లద్వారా అభ్యంతర కర ప్రచారం చేయ రాదు. అభ్యంతర కరమైన మెసేజ్‌లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు 
- పోలింగ్‌ స్టేటసన్‌ నుంచి 200 మీటర్ల టేబుల్, రెండు  కుర్చీలు అభ్యర్థి  బ్యానర్‌తో ఎన్నికల బూత్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. 
- పోలింగ్‌ స్టేసన్‌ నుంచి 100 మీటర్లలోపు ప్రచారం చేయడం నిషేధం.   ఈ సమయంలో మొబైల్‌ ఫోన్‌ మాట్లడడం కూడా నిషేధం.
- ఎన్నికల రోజున అభ్యర్థి  ఏజెంటు పార్టీ వర్కర్ల  కోసం ఒక వాహనం ఉపయోగించుకోవచ్చు. ఈ వాహనంలో ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుంది. 
- పోలింగ్‌ రోజు ఓటర్లను తరలించడానికి అభ్యర్థులు
- ప్రైవేట్‌ వాహనాలను సమకూర్చుకోవడం నిషేధం.
- ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకుందుకు సహకరించాలి. 

అధికార పార్టీ వారైనా....
- ఎన్నికల ప్రచారాన్ని అధికారిక పర్యటనలతో కలిసి చేయకూడదు. 
- అధికార యంత్రాలను , అతిథి గృహాలను ఉపయోగించ రాదు. 
- ప్రభుత్వ ఖర్చుతో మీడియా ప్రకటనలు ఇవ్వవద్దు. రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతి కల్పిస్తామని ప్రకటనలు చేయొద్దు. 
- పోలింగ్‌ కేద్రాల్లోకి మంత్రులు ప్రవేశించరాదు. 

నిబంధనలు 
- రాజకీయ  పార్టీలు ,నాయకులు అంగీకరించిన మార్గ దర్శక సూత్రాలు ఎన్నికల నిబంధనల్లో చేర్చ బడతాయి. 
- ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయవద్దు. ఎన్నికల నియమావళి యావత్తు రాష్ట్రానికి  వర్తిస్తుంది. 
- అధికారిక పర్యటనలను ఎన్నిక పనిలో కలపొద్దు.
- ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల బదిలీపై పూర్తి నిషేధం ఉంటుంది. 

నియమాలు 
- అభ్యర్థులు వ్యక్తిగతంగా, పార్టీ తరఫున గాని కుల, మత భాషా విద్వేషాలు రెచ్చగొట్టవద్దు.
- కుల, మత ప్రాతిపదికన ఓట్లు అడుగొద్దు. మందిరాలు, మసీదులు, చర్చీల్లో పాటు ఇతర ప్రార్థనా ప్రాంతాలను ఎన్నిక ప్రచారం కోసం వాడకూడదు. 
- ఓటు కోసం డబ్బులు ఇవ్వడం, బెదిరించడం నిషేధం . ఒక వ్యక్తి ఓటు మరో వ్యక్తి వేయడం నేరం.
- ఇతర పార్టీల ఎన్నికల ప్రచారం సమావేశాలకు ఆటంకం కలిగించ కూడదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top