మహిళా మంత్రులు లేనందునే మహిళా గవర్నర్‌ 

BJP Leader Babu Mohan Speech At Jogipet - Sakshi

సాక్షి, జోగిపేట(అందోల్‌): రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కే.మాధవి అన్నారు. జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్‌ హాలులో జరిగిన నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో కమీషన్ల ప్రభుత్వం.. 
రాష్ట్రంలో మహిళా మంత్రులకు అవకాశాన్ని సీఎం కేసీఆర్‌ కల్పించకపోవడంతో కేంద్రం ఒక మహిళను గవర్నర్‌గా నియమించిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని చూస్తేనే టీఆర్‌ఎస్‌ పార్టీలో గుబులు పుడుతుందన్నారు. రాష్ట్రంలో కమీషన్ల ప్రభుత్వం కొనసాగుతుందని, సచివాలయంలో కాలుపెట్టని తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం మరిచిపోయిందన్నారు.

33లక్షల బీజేపీ సభ్యత్వాలు పూర్తి 
రాష్ట్రంలో ఇప్పటి వరకు 33 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయన్నారు.  మాజీ మంత్రి బాబూమోహాన్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7500 సభ్యత్వాలు పూర్తయ్యాయన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 1.80 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని, జనవరి 13వ తేది వరకు సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సమావేశంలో జహీరాబాద్‌ బీజేపీ పార్లమెంట్‌ ఇంచార్జి ఆర్‌.ప్రభాకర్‌గౌడ్,  నియోజకవర్గ ఇంచార్జి ప్రభాత్‌కుమార్, జిల్లా నాయకులు జగన్నాథం, ప్రేమ్‌సాగర్, కిసాన్‌ మోర్చా జిల్లా కార్యదర్శి ఆర్‌.మాణయ్య,పట్టణ అధ్యక్షులు ఎర్రారం సతీష్‌ ముదిరాజ్, నాయకులు నవీన్, సాయి, హరీష్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top