దేవేందర్‌గౌడ్‌కు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆహ్వానం | Bhatti Vikramarka Meet Devender Goud In Rangareddy | Sakshi
Sakshi News home page

దేవేందర్‌గౌడ్‌కు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆహ్వానం

Aug 21 2019 7:58 AM | Updated on Aug 21 2019 8:01 AM

Bhatti Vikramarka Meet Devender Goud In Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి : టీడీపీ సీనియర్‌ నేత తూళ్ల దేవేందర్‌గౌడ్‌కు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆహ్వానం అందింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆయనను నగరంలోని తన నివాసంలో కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలంటూ దేవేందర్‌గౌడ్‌ను భట్టి ఆహ్వానించారు. కాగా, ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్న దేవేందర్‌గౌడ్‌.. వారి ఆహ్వానంపై ఎటూ తేల్చుకోలేదని విశ్వసనీయ సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement