ఫలితమివ్వని భగీరథ ప్రయత్నం | Bhagiratha unproductive effort | Sakshi
Sakshi News home page

ఫలితమివ్వని భగీరథ ప్రయత్నం

Mar 16 2017 3:44 AM | Updated on Jun 4 2019 5:16 PM

ఫలితమివ్వని భగీరథ ప్రయత్నం - Sakshi

ఫలితమివ్వని భగీరథ ప్రయత్నం

మహబూబ్‌నగర్‌ జిల్లా మరికల్‌ మండలం అప్పంపల్లికి చెందిన రైతు దామోదర్‌రెడ్డికి నాలుగెకరాల పొలం ఉంది.

రెండేళ్లలో 32 బోర్లు
- ఒకదాంట్లోనే కొద్దిపాటి నీరు
- పాలమూరు జిల్లా మరికల్‌ రైతు కష్టం


మరికల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మరికల్‌ మండలం అప్పంపల్లికి చెందిన రైతు దామోదర్‌రెడ్డికి నాలుగెకరాల పొలం ఉంది. ఆపర భగీరథుడిలా గడిచిన రెండేళ్లలో 31 బోర్లను డ్రిల్లింగ్‌ చేశాడు. కానీ, ఒక్క బోరులో కూడా చుక్కనీరు రాలేదు. దీంతో బోర్ల డ్రిల్లింగ్‌కు చేసిన అప్పులను తీర్చలేక నరకం అనుభవిస్తున్నాడు. తీరా విసుగెత్తి తన ఇంటి ఎదుట ఉన్న అర ఎకరాలో 32వ సారి బోరు వేశాడు. కొద్దిపాటి నీరు రావడంతో ఏడాది గా ఇంటిముందే తోటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఇప్పుడు అందులోనూ నీరు రాకపోవడంతో తోట ఎండిపోతోంది. వేసవి కారణంగా ఉమ్మడి మరికల్‌ మండలంలో ఇప్పటికే అప్పంపల్లి, మాధ్వార్, కిష్టాపూర్, మరికల్, ధన్వాడ, గున్ముక్ల, ఎలిగండ్లల్లోని వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీం తో పంటలను కాపాడుకునేందుకు ఒక్కో రైతు 5 నుంచి పది వరకు బోర్లను వేశారు. పంటలకు చేసిన అప్పులు తీర్చలేక వ్యవసాయాన్నే వదులుకునే పరిస్థితులు ఏర్పడాయి.  

అప్పులే మిగిలాయి
పంటలు పండించాలని ఆశతో 32 బోర్లను డ్రిల్లింగ్‌ చేశాను. కానీ ఒక బోరులో కూడా  నీరు రాకపోవడంతో తనకు అప్పులే మిగి లాయి. 32 బోర్లకు రూ.6.40 లక్షలు ఖర్చు చేశాను.  బోర్లు వేయడం మానుకున్నాను.
    – దామోదర్‌రెడ్డి, బాధిత రైతు, అప్పంపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement