breaking news
Bores Drilling
-
ఫలితమివ్వని భగీరథ ప్రయత్నం
రెండేళ్లలో 32 బోర్లు - ఒకదాంట్లోనే కొద్దిపాటి నీరు - పాలమూరు జిల్లా మరికల్ రైతు కష్టం మరికల్: మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలం అప్పంపల్లికి చెందిన రైతు దామోదర్‌రెడ్డికి నాలుగెకరాల పొలం ఉంది. ఆపర భగీరథుడిలా గడిచిన రెండేళ్లలో 31 బోర్లను డ్రిల్లింగ్ చేశాడు. కానీ, ఒక్క బోరులో కూడా చుక్కనీరు రాలేదు. దీంతో బోర్ల డ్రిల్లింగ్కు చేసిన అప్పులను తీర్చలేక నరకం అనుభవిస్తున్నాడు. తీరా విసుగెత్తి తన ఇంటి ఎదుట ఉన్న అర ఎకరాలో 32వ సారి బోరు వేశాడు. కొద్దిపాటి నీరు రావడంతో ఏడాది గా ఇంటిముందే తోటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇప్పుడు అందులోనూ నీరు రాకపోవడంతో తోట ఎండిపోతోంది. వేసవి కారణంగా ఉమ్మడి మరికల్ మండలంలో ఇప్పటికే అప్పంపల్లి, మాధ్వార్, కిష్టాపూర్, మరికల్, ధన్వాడ, గున్ముక్ల, ఎలిగండ్లల్లోని వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీం తో పంటలను కాపాడుకునేందుకు ఒక్కో రైతు 5 నుంచి పది వరకు బోర్లను వేశారు. పంటలకు చేసిన అప్పులు తీర్చలేక వ్యవసాయాన్నే వదులుకునే పరిస్థితులు ఏర్పడాయి. అప్పులే మిగిలాయి పంటలు పండించాలని ఆశతో 32 బోర్లను డ్రిల్లింగ్ చేశాను. కానీ ఒక బోరులో కూడా నీరు రాకపోవడంతో తనకు అప్పులే మిగి లాయి. 32 బోర్లకు రూ.6.40 లక్షలు ఖర్చు చేశాను. బోర్లు వేయడం మానుకున్నాను. – దామోదర్‌రెడ్డి, బాధిత రైతు, అప్పంపల్లి -
రూ.5 కోట్లతో తాగునీటి బోర్ల డ్రిల్లింగ్
మదనపల్లె: రాజంపేట పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి నీటి సమస్య పరిష్కారం కోసం బోర్లను డ్రిల్లింగ్ చేయనున్నట్లు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆయన ఫోన్లో విలేకరులతో మాట్లాడారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో తన నిధుల నుంచి రూ.5 కోట్లను బోర్ల డ్రిల్లిం గ్‌కు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 7 నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉన్న 400 గ్రామాలను ఎంపిక చేశామని చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో డ్రిల్లిం గ్ చేస్తున్నట్లు వివరిం చారు. శాశ్వత పరిష్కారానికి అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నట్లు తెలి పారు. వెలుగోడు ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా మంచినీళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశామని, అయితే టీడీపీ నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈ పనులను నిలుపుదల చేశారని ఆరోపించారు. కొంతవరకైనా సమస్య పరిష్కరించాలన్న ఉద్దేశంతో నిధులను అధికంగా మంజూరు చేశానన్నారు. హంద్రీ- నీవా జలాశయంతోనైనా సమస్య శాశ్వత పరి ష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.