సేవలందిస్తే ద్రోహం చేశారు | Sakshi
Sakshi News home page

సేవలందిస్తే ద్రోహం చేశారు

Published Tue, Nov 20 2018 10:45 AM

Banda Karthika Reddy Nomination in Secunderabad Rebel - Sakshi

చిలకలగూడ: మూడు దశాబ్దాలుగా సేవ చేస్తున్న తనకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి బండ కార్తీకచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులతో కలిసి ర్యాలీగా వచ్చిన ఆమె సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పారాచూట్‌ నాయకులకు టికెట్‌ ఇవ్వమని చెబుతూనే సికింద్రాబాద్‌తో ఎటువంటి సంబంధం లేని నాయకుడికి టికెట్‌ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా  సేవలు చేసిన తనకు కాంగ్రెస్‌ పెద్దలు తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు ఒత్తిడి మేరకు నామినేషన్‌ వేశానని, దానిని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్‌ పెద్దలు తలలు దించుకుంచే రీతిలో విజయం సా«ధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement