రానున్న మూడు వారాలే అత్యంత కీలకం

Awareness on Coronavirus Hyderabad People - Sakshi

కోవిడ్‌ మూడో దశలోకి వెళ్తే మృత్యు ఘంటికలే  

స్వీయరక్షణపై మరింత అవగాహన అవసరం  

కరోనా వైరస్‌ విజృంభణపై వైద్య నిపుణుల అంచనా

గాంధీఆస్పత్రి: ప్రాణాంతకమైన కోవిడ్‌ వైరస్‌ను నియంత్రించేందుకు రానున్న మూడు వారాలే అత్యంత కీలకమని, మూడో దశకు వెళ్తే మృత్యు ఘంటికలు మోగుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  తెలంగాణలో రెండురోజులుగా లోకల్‌ కాంటాక్టు ద్వారా ఐదు పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. తెలంగాణలో మొత్తం 39 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ, చెస్ట్‌ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో 26 మంది బాధితులు వైద్య చికిత్సల అనంతరం కోలుకుంటున్నారని, బీపీ, సుగర్‌ నార్మల్‌గా ఉన్నాయని, వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని ట్రీటింగ్‌ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రానున్న మూడు వారాల్లో  వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలంతా హోం క్వారంటైన్‌లో ఉండాలని, స్వీయరక్షణపై మరింత శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారిలో 34 మంది విదేశీయులతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చినవారు, ఐదుగురు  స్థానికులు (లోకల్‌ కాంటాక్టు ) ఉన్నారని, ఈ పరిస్థితిని స్టేజ్‌ 2గా పరిగణిస్తారని, ఇక్కడి పరిస్థితులు, ఉష్ణోగ్రతలకు తట్టుకునేలా కోవిడ్‌ వైరస్‌ రూపాంతరం చెంది, స్థానిక ప్రజల్లో వ్యాపిస్తే స్టేజ్‌ 3కి చేరినట్లేనన్నారు. ఇదే జరిగితే పెద్దసంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. స్టేజ్‌– 3లో వృద్ధులు, ఇతర రుగ్మతలు, వ్యాధులతో బాధపడేవారికి కోవిడ్‌ వైరస్‌ సులభంగా సోకే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. వృద్ధులు,బాలింతలు, గర్భిణులు, చిన్నారులు, వివిధ రుగ్మతలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కీలకమైన ఈ మూడు వారాలు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తిని విజయవంతంగా నివారించవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. 

తక్షణమే డిశ్చార్జి చేయండి సారూ..  
నోడల్‌ కేంద్రమైన గాంధీఆస్పత్రిలో సాధారణ చికిత్సలు కోసం ఇన్‌పేషెంట్లుగా చేరిన రోగులు ఇకపై గాంధీ ఉండమని, తక్షణమే డిశ్చార్జి చేయాలంటూ సంబంధిత వైద్యులను కోరుతున్నారు. మూడు రోజుల క్రితమే గాంధీ ఓపీ విభాగం మూసివేసిన సంగతి విదితమే. సర్జరీలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రతి నిత్యం 2000 నుంచి 2,500 వేల మంది ఉండే ఇన్‌పేషెంట్‌ విభాగంలో రోగులు çసంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.  మరికొన్ని రోజుల్లో సాధారణ రోగులను డిశ్చార్జి చేసి  కేవలం కోవిడ్‌ బాధితులు, అనుమానితుల కోసమే గాంధీ ఆస్పత్రిని సిద్ధం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

బాధితులు కోలుకుంటున్నారు..  
గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న 26 మంది కోవిడ్‌ బాధితులు వైద్యసేవల అనంతరం  కోలుకుంటున్నారని కోవిడ్‌ కన్వీనర్, జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ రాజారావు స్పష్టం చేశారు. ఐసోలేషన్‌ వార్డులో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించామని, ఆహ్లాదకరమైన వాతావరణంలో బాధితులంతా కోలుకుంటున్నారని, ఐసోలేషన్‌లో చేరిన నాటి నుంచి 14 రోజుల గడువు ముగిసిన వారికి రెండు దఫాలుగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ వస్తే డిశ్చార్జి చేస్తామన్నారు.

కోవిడ్‌ ఓపీ 211.. ఐసోలేషన్‌లో 35 మంది..
గాంధీ ఆస్పత్రి కోవిడ్‌ ఓపీ విభాగానికి అనుమానితులు క్యూ కడుతున్నారు. బుధవారం ఓపీ విభాగానికి 211 మంది రాగా, వీరిలో 35 మందిని గుర్తించి ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేసి నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపినట్లు నోడల్‌ అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం అందిన నివేదికల్లో 60 మందికి కోవిడ్‌ నెగిటివ్‌ రావడంతో వారికి జాగ్రత్తలు చెప్పి డిశ్చార్జి చేశామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

07-04-2020
Apr 07, 2020, 10:10 IST
సాక్షి, హైదరాబాద్‌: ఘట్‌కేసర్‌ సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌లో రంజిత్‌ విద్యనభ్యసిస్తున్నాడు. ప్రతిరోజూ మారేడుపల్లి నుంచి సిటీబస్సులో కాలేజీకి వెళ్లి వస్తుంటాడు....
07-04-2020
Apr 07, 2020, 10:01 IST
సాక్షి, సిటీబ్యూరో: చాపకిందనీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ నగర వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా సోమవారం హైదరాబాద్‌...
07-04-2020
Apr 07, 2020, 09:47 IST
కొహెడ: మామిడికాయల మార్కెట్‌ను కొత్తపేట నుంచి తరలించి తాత్కాలికంగా కొహెడలోని మార్కెట్‌ స్థలంలో ఏర్పాటు చేయనున్నట్లు ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి...
07-04-2020
Apr 07, 2020, 09:43 IST
కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఇంధనాలకు డిమాండ్‌ గణనీయంగా పడిపోయింది.
07-04-2020
Apr 07, 2020, 09:39 IST
చాదర్‌ఘాట్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు బంద్‌ చేసినట్లు మార్కెట్‌ జాయింట్‌...
07-04-2020
Apr 07, 2020, 09:38 IST
కరోనా బారిన పడిన బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌(55) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
07-04-2020
Apr 07, 2020, 09:24 IST
సాక్షి, శ్రీకాకుళం: కరోనా కల్లోలం సృష్టిస్తుంటే జిల్లా వాసులకు ఆ త్రిమూర్తులు అభయమిచ్చారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి...
07-04-2020
Apr 07, 2020, 09:11 IST
ప్రతికూల పరిస్థితుల నుంచి పరిశ్రమలను బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
07-04-2020
Apr 07, 2020, 09:11 IST
ఇస్లామాబాద్‌ : చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్‌ ప్రపంచదేశాలకు పాకింది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటికే ప్రపంచ...
07-04-2020
Apr 07, 2020, 08:54 IST
సాక్షి, నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఉదయం వరకు 34 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం...
07-04-2020
Apr 07, 2020, 08:38 IST
సాక్షి, ఒంగోలు: కోవిడ్‌–19 వైరస్‌ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాను రెడ్‌ జోన్‌ పరిధిలోకి  తీసుకువచ్చింది....
07-04-2020
Apr 07, 2020, 08:29 IST
సాక్షి, హైదరాబాద్‌: నిజాముద్దీన్‌లో తబ్లీగి జమాత్‌కు హాజరై హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న ఆరుగురు మలేషియన్లపై బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు...
07-04-2020
Apr 07, 2020, 08:21 IST
సాక్షి, సిటీబ్యూరో:  లాక్‌డౌన్‌ ప్రభావం మందుబాబులపై భారీగానే ఉంది. పనిలో పనిగా ఆన్‌లైన్‌లోనూ మద్యం కోసం సెర్చ్‌ చే సేస్తున్నారు....
07-04-2020
Apr 07, 2020, 08:07 IST
బంజారాహిల్స్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు చిత్రవిచిత్రమైన కేసులు...
07-04-2020
Apr 07, 2020, 07:41 IST
కర్ణాటక, గంగావతి రూరల్‌: కొప్పళ నగరంలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి బైక్‌లపై బయట తిరిగే వారికి సోమవారం మంగళముఖిలు (హిజ్రాలు) వినూత్నంగా...
07-04-2020
Apr 07, 2020, 07:24 IST
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయం మహాదీపం కొండపై చైనా యువకుడు దాగి ఉన్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో గాలింపులు...
07-04-2020
Apr 07, 2020, 07:17 IST
చిత్తూరును రెడ్‌ జిల్లాగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు త్వరగా,ఎక్కువగా విస్తరిస్తున్న 96...
07-04-2020
Apr 07, 2020, 04:47 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,...
07-04-2020
Apr 07, 2020, 04:40 IST
సాక్షి, అమరావతి: వేసవిలో నిరాటంకంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌...
07-04-2020
Apr 07, 2020, 04:34 IST
న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 14 తరువాత లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి సంకేతాలిచ్చారు. దేశవ్యాప్తంగా వైరస్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top