
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్, శాంతిభద్రతలు, నేర నియంత్రణ ప్రభుత్వ సలహదారుడిగా రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అందిన అధికారిక ఉత్తర్వులను స్వీకరించి జాయినింగ్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అనురాగ్ శర్మ పంపించారు. సచివాలయంలో పూర్తి స్థాయిలో కార్యాలయం ఏర్పాటైన తర్వాత తన కార్యకలాపాలు సాగించనున్నట్టు ఆయన తెలిపారు.