సాగర్ జలాల కోసం మరో ఉద్యమం: పొంగులేటి | Another movement to ready for Sagar waters, says ponguleti srinivasa rao | Sakshi
Sakshi News home page

సాగర్ జలాల కోసం మరో ఉద్యమం: పొంగులేటి

Oct 22 2014 3:04 AM | Updated on Aug 21 2018 5:36 PM

సాగర్ జలాల కోసం మరో ఉద్యమం: పొంగులేటి - Sakshi

సాగర్ జలాల కోసం మరో ఉద్యమం: పొంగులేటి

సాగర్ జలాలను ఖమ్మం జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు అందించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమవుతోందని..

 వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి
 సాక్షిప్రతినిధి, ఖమ్మం: సాగర్ జలాలను ఖమ్మం జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు అందించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమవుతోందని పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కిగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌తోపాటు పలు ప్రాంతాలు పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ఏరకమైన ప్రాధాన్యం ఇస్తారో.. వ్యవసాయానికి కూడా అదేరీతిలో సాగునీరు ఇవ్వాలన్నారు. రైతుల కన్నీరు తుడవకుండా ఏ అభివృద్ధి చేసినా నిష్ర్పయోజనమేనని అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును నేరుగా కలిసి రైతుల సమస్యలను వివరిస్తామని చెప్పారు. సాగర్ జలాలతో వైరా రిజర్వాయర్‌ను నింపాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement