తమ్ముడిని చంపిన అన్నల అరెస్టు | Anna was arrested for killing brother | Sakshi
Sakshi News home page

తమ్ముడిని చంపిన అన్నల అరెస్టు

Oct 14 2014 4:02 AM | Updated on Sep 2 2017 2:47 PM

తమ్ముడిని చంపిన అన్నల అరెస్టు

తమ్ముడిని చంపిన అన్నల అరెస్టు

నారాయణపేట రూరల్: కుటుంబకల హాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో తమ్ముడు మృతిచెందాడు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు

నారాయణపేట రూరల్: కుటుంబకల హాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో తమ్ముడు మృతిచెందాడు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు రాజుతో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ రవీం ద్రప్రసాద్, ఎస్‌ఐ యాలాద్రి వివరాలు వెల్లడించారు. మండలంలోని జాజాపూర్ గ్రామానికి చెందిన రాజు, అంజ ప్ప, అర్జున్, యాదప్ప, భీమప్ప సొం త అన్నదమ్ములు.

కొంతకాలంగా అర్జున్, రాజు మధ్య తగాదాలు ఉన్నా యి. రెండోఅన్న అంజప్ప మృతిచెందడంతో ముంబాయి నుంచి ఆయన అంత్యక్రియల కోసం ఈనెల 10న అర్జున్ స్వగ్రామానికి వచ్చాడు. అదేరోజు రాత్రి అర్జున్‌తో రాజు గొడవకు దిగాడు. వారి మధ్య మాటామాట పెరి గి ఘర్షణ చోటుచేసుకుని కర్రతో కొట్టడంతో అర్జున్ అక్కడికక్కడే మృతి చెం దాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా రాజుతో పాటు మిగతా అన్నదమ్ములు యాదప్ప, భీమప్ప, తమ బం ధువు ఆటోడ్రైవర్ హన్మంతు సహకారంతో గ్రామ శివారులోని శ్మశానవాటికకు శవాన్ని ఆటోలో తరలించి ఆనవా ళ్లు లేకుండా పూడ్చిపెట్టారు.

ఈ విష యం గ్రామాస్తుల ద్వారా బయటికిపొక్కడంతో సమాచారం అందుకున్న పో లీసులు సోమవారం గ్రామానికి చేరుకున్నారు. ప్రధాన నిందితుడు రాజు కుటుంబాన్ని విచారించి ఆయనతో పాటు సహకరించిన ముగ్గురిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాజు సమాచారంతో పూడ్చిన శవాన్ని వెలికితీసి ‘పేట’ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యుల కు అందజేసినట్లు సీఐ పేర్కొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement