తెలంగాణ సీఎస్తో అమెరికా రాయబారి భేటీ | american consulate general meets telangana cs | Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎస్తో అమెరికా రాయబారి భేటీ

Sep 20 2014 4:07 PM | Updated on Aug 24 2018 8:18 PM

అమెరికాన్ కాన్సులేట్ జనరల్ మైఖేల్ ములిన్ శనివారం నాడు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు.

అమెరికాన్ కాన్సులేట్ జనరల్ మైఖేల్ ములిన్ శనివారం నాడు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు. నానక్రాం గూడ ప్రాంతంలో అమెరికా కాన్సులేట్ కొత్త భవన నిర్మాణంపై ఆయనతో చర్చించారు. ఈ ప్రాంతంలో అమెరికా రాయబార కార్యాలయ భవనానికి సంబంధించిన ఒప్పంద పత్రాలను అమెరికన్ అధికారులకు రాజీవ్ శర్మ అందించారు.

త్వరలోనే ఆ భూముల్లో కాన్సులేట్ భవనాన్ని నిర్మిస్తామని మైఖేల్ ములిన్ తెలిపారు. అన్ని ప్రధాన భవనాలు, అధికారుల నివాస భవనాలను నానక్రాం గూడ, మణికొండ, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే అమెరికా రాయబార కార్యాలయానికి కూడా అక్కడ కొంత భూమిని కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement