‌‘ఆ హ‌క్కు రాష్ట్రానికి లేదు’ | AG BS Prasad Said Full pensions Will Be Give From June In telangana | Sakshi
Sakshi News home page

‌ఆ హ‌క్కు రాష్ట్రానికి లేదు.. జూన్ నుంచి పూర్తి పింఛ‌న్లు

Jun 24 2020 2:59 PM | Updated on Jun 24 2020 4:07 PM

AG BS Prasad Said Full pensions Will Be Give From June In telangana - Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : పింఛ‌న్ల‌లో 25 శాతం ప్రభుత్వం కోత విధించడంపై దాఖ‌లైన పిటీష‌న్‌ను బుధ‌వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ హైకోర్టు విచారణ చేప‌ట్టింది. పిటిషనర్‌ తరపున వాదనలు వినిపించిన సీనియర్‌  కౌన్సిల్‌ రంగయ్య, చిక్కడు ప్రభాకర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన 3 లక్షల పింఛన్లను వెంటనే విడుదల చేయించాలని కోర్టుకు విన్నవించారు. పింఛన్లలో కోత విధించే హక్కు రాష్ట్రాలకు లేదని పేర్కొన్నారు. పింఛన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దీనిలో కోత విధించడానికి వీల్లేదని వాదించారు.(తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు)

ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ..  ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మరోసారి చర్చించి నిర్ణయం చెబుతామని కోర్టుకు వివరించారు. జూన్‌ నుంచి పూర్తిస్థాయిలో పింఛన్లు అందజేస్తున్నామని వెల్లడించారు. కాగా ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది.  ('ప్రత్యేక బోగీల ఏర్పాటు వీలుకాదు')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement