ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | Adilabad deadly road accident | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Jan 10 2015 2:45 AM | Updated on Aug 30 2018 3:58 PM

ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi

ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మండలంలోని లంబాడితండా వద్ద నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై ఆటోను లారీ వేగంగా ఢీకొట్టింది.

  • లారీ, ఆటో ఢీకొని ఆరుగురి మృతి
  • కడెం: ఆదిలాబాద్ జిల్లా కడెం మండల కేంద్రం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని లంబాడితండా వద్ద నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై ఆటోను లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..

    మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన బర్ల లచ్చవ్వ, ఆమె అక్క కూతుళ్లు గంటి శైలజ (22), ఏనుగుల గంగామణి (17)తో పాటు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం జిల్లెడుకుంటకు చెందిన ఆత్రం బాపూరావు(52), టేకం సందూర్‌బాయి(41), టేకం గిరిజాబాయి(46), టేకం కమలాబాయి(63)లు ఆటోలో ప్రయాణిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో కడెం దాటి లంబాడితండా క్రాసింగ్ వద్దకు రాగా, ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది.

    దీంతో శైలజ, గంగామణి, ఆత్రం బాపూరావు, టేకం సందూర్‌బాయిలు అక్కడికక్కడే చనిపోయారు. టేకం గిరిజాబాయి, టేకం కమలాబాయి, బర్ల లచ్చవ్వకు తీవ్ర గాయాలు కాగా.. వారిని ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో గిరిజాబాయి, కమలాబాయి చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ఇద్దరు ప్రయాణికులు మడావి బాలు, పెద్ది రాజు, డ్రైవర్ శారూఖ్ చికిత్స పొందుతున్నారు. ఈ  సంఘటనలో ఆటో నుజ్జునుజ్జయ్యింది.
     

Advertisement
 
Advertisement
Advertisement