పండుగ వేళ.. మృత్యు హేల | accedent in mahaboobnagar district maktal | Sakshi
Sakshi News home page

పండుగ వేళ.. మృత్యు హేల

Aug 7 2017 2:06 AM | Updated on Nov 6 2018 4:38 PM

పండుగ వేళ.. మృత్యు హేల - Sakshi

పండుగ వేళ.. మృత్యు హేల

ఎదురుగా వస్తున్న ఓ లారీని ఆటో ఢీకొట్టడంతో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

► లారీని ఢీకొట్టిన ఆటో.. ఆరుగురు దుర్మరణం
► మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ సమీపంలో ఘటన

మక్తల్‌: ఎదురుగా వస్తున్న ఓ లారీని ఆటో ఢీకొట్టడంతో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలం కాచ్‌వార్‌ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మక్తల్‌ మండలం మాదన్‌ పల్లికి చెందిన చిన్నకురుమయ్య ఆటో నడుపు తూ జీవనం సాగిస్తున్నాడు.ఆదివారం సంత కావడంతో ఆటోలో 18 మంది ప్రయాణి కులను ఎక్కించుకొని మక్తల్‌ నుంచి తిరిగి వస్తుండగా.. కాచ్‌వార్‌ సమీపంలో ఓ గొర్రెను తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొ ట్టాడు.

దీంతో ఆటో డ్రైవర్‌ చిన్న కురుమయ్య (30)తోపాటు మాదన్‌పల్లికి చెందిన రాములు (65), హన్మంతు(50), జక్లేర్‌కు చెందిన వెంకటయ్య(50) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జయమ్మ, చంద్రమ్మ మహబూ బ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడిన  దత్తుశ్రీలు మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందు తోంది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మక్తల్‌ ప్రభుత్వా సుపత్రికి తరలించారు. ఆటోలో డ్రైవర్‌ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిం చుకోవడంతోపాటు నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement