
'ఒరిజినల్ నివేదిక ఇవ్వడం కుదరదు'
ఓటుకు కోట్లు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన సీల్డ్ కవర్ లో ఇచ్చిన నాలుగు నివేదికలను ఏసీబీ కోర్టు శుక్రవారం పరిశీలించింది.
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన సీల్డ్ కవర్ లో ఇచ్చిన నాలుగు నివేదికలను ఏసీబీ కోర్టు శుక్రవారం పరిశీలించింది. ఈ నివేదికలు తమకు ఇవ్వాలన్న ఏసీబీ అధికారుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఒరిజినల్ నివేదికలు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. నివేదిక నకలు కావాలంటే మెమో దాఖలు చేయాలని సూచింది.
దీంతో మరో మెమో వేసేందుకు ఏసీబీ అధికారులు సమాయత్తమవుతున్నారు. తెలంగాణ నామిటేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ లో మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో టేపును ఎఫ్ఎస్ఎల్ పరిశీలించిన సంగతి తెలిసిందే. నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించింది.