భోజనం వికటించి 62 మందికి అస్వస్థత | 62 Students Become Sick Due To Food Poisoning At Nizamabad | Sakshi
Sakshi News home page

భోజనం వికటించి 62 మందికి అస్వస్థత

Nov 25 2019 4:35 AM | Updated on Nov 25 2019 4:35 AM

62 Students Become Sick Due To Food Poisoning At Nizamabad - Sakshi

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్ర శివారులోని నాగారం ప్రాంతంలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్‌ కళాశాలలో భోజనం వికటించి 62 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. సిబ్బంది వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తు తం వారి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఆదివారం విద్యార్థినులను పరామర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించిన ఆయన.. భోజనం శాంపిల్స్‌ సేకరించాలని అధికారులకు సూచించారు. సాయంత్రం విద్యార్థినులను డిశ్చార్జి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement