మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం చిన్నగుండవెల్లిలో శనివారం ఒక్కరోజే ఆరుగురు చిన్నారులకు డెంగ్యూ లక్షణాలు కనిపించాయి.
సిద్ధిపేట రూరల్ (మెదక్) : మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం చిన్నగుండవెల్లిలో శనివారం ఒక్కరోజే ఆరుగురు చిన్నారులకు డెంగ్యూ లక్షణాలు కనిపించాయి. గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి కుమారుడు ప్రణీత్‌రెడ్డి (14 నెలలు), భూమయ్యగారి రాంరెడ్డి కుమార్తె కీర్తన (8), గడీల భాస్కర్‌రెడ్డి కుమార్తె శ్రావణి (7), రాజరాంగారి చంద్రారెడ్డి కుమారుడు చరణ్ (7), కరుణాకర్ కుమార్తె నిచిత (11), చెందిరెడ్డి మల్లారెడ్డి కుమారుడు వినయ్‌రెడ్డి(5)లకి తీవ్ర జ్వరం రావడంతో సిద్ధిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. వారంతా డెంగ్యూతో బాధపడుతున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.