19 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత | 19 sand tractors seized in warangalb distiric | Sakshi
Sakshi News home page

19 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

Feb 11 2015 3:23 PM | Updated on Aug 28 2018 8:41 PM

ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకునేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు.

వరంగల్:  ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకునేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలంలో ఇసుక క్వారీలపై  బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 19 ట్రాక్టర్లను మామునూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇసుకను వరంగల్ పట్టణానికి తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వాటిని పోలీసులు సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(మామునూర్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement