ఆర్టీసీ బస్సు ఢీ: ఒకరికి గాయాలు | 1 injured in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీ: ఒకరికి గాయాలు

May 16 2015 12:05 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఆర్టీసీ బస్సు ఢీ: ఒకరికి గాయాలు - Sakshi

ఆర్టీసీ బస్సు ఢీ: ఒకరికి గాయాలు

నిజామాబాద్ జిల్లాలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.

మకులూరు:  నిజామాబాద్ జిల్లాలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.  జిల్లాలోని  మకులూరు మండలం మాదాపూర్ వద్ద ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. నిజామాబాద్ డిపోకు చెందిన బస్సు నందిపేట నుంచి నిజామాబాద్ వెళ్తుంది. కాగా, మార్గమధ్యలో మాదాపూర్ గ్రామం వద్ద అదుపుతప్పిన బస్సు  రోడ్డుపై వెళ్తున్న రవిందర్ అనే వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతనిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement