breaking news
-
తగ్గని అసంతృప్త స్వరాలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ అభ్యర్థులుగా బయటివారికి ప్రాధాన్యమివ్వడంపై బీజేపీలో ఇంకా అసంతృప్త స్వరాలు తగ్గడం లేదు. ఇప్పటివరకు 15 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఏడుగురు ఇటీవలే చేరినవారికి (ఒకరు పార్టీలో కూడా చేరకున్నా) టికెట్లు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్డ్ సీట్లను (మూడు ఎస్సీ, రెండు ఎస్టీ సీట్లు) పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి కాకుండా ‘వలస’ నేతలకే ఇవ్వడం ఏమిటని (ఇంకా వరంగల్ ఎస్సీ సీటు ఖరారు కాలేదు) ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తమకు టికెట్ దక్కని కొందరు నేతలు అసంతృప్తితో పార్టీ మారొచ్చంటూ ప్రచారం జరుగుతోంది. మహబూబ్‌నగర్ సీటును పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కేటాయించడంతో.. ఆ స్థానాన్ని ఆశించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి నిరుత్సాహానికి గురయ్యారు. దీనికితోడు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నేతలు గురువారం జితేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జితేందర్‌రెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం సాగింది. అయితే ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని, పార్టీ మారే ఉద్దేశమేదీ లేదని ఆయన ప్రకటించారు. వేధించిన వారికి టికెట్లా? నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ గుర్రంపోడు ఎస్టీల భూముల పోరు అంశంలో బీజేపీ నాయకులపై అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కేసులుపెట్టి జైలుకు పంపారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పార్టీ శ్రేణులను వేధించిన వ్యక్తిని బీజేపీలో చేర్చుకుని నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోసం టికెట్ త్యాగం చేసి, తర్వాత చేరిన మరో కాంగ్రెస్ నేతకు అసెంబ్లీ టికెట్ ఇచ్చినా సహకరించిన పార్టీ నేత జి.మనోహర్‌రెడ్డికి నల్లగొండ ఎంపీ సీటు ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీస్తున్నాయి. ఇక నాగర్‌కర్నూల్ ఎంపీ సీటును బీఆర్ఎస్ ఎంపీ కుమారుడికి ఇచ్చి.. పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శ్రుతికి మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సబబు అని బీజేపీ అసంతృప్త నేతలు ప్రశ్నిస్తున్నారు. 20ఏళ్లకుపైగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్‌ను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన శ్రీనివాస్‌కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడం సరికాదని అంటున్నారు. వరంగల్ జిల్లాలో పార్టీ కేడర్‌పై కేసులకు కారణమైన అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తాం, పార్టీలోకి రావాలంటూ పిలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అరూరి రమేశ్‌ను పార్టీలోకి తీసుకోవద్దని, వరంగల్ ఎంపీ సీటు ఇవ్వొద్దని గురువారం రాష్ట్ర నాయకత్వానికి మాజీ మంత్రి జి.విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే జైపాల్, ఇతర ఎస్సీ వర్గ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇదే డిమాండ్‌తో వరంగల్ జిల్లా నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన కూడా చేశారు. ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎంపీ టికెట్లు ఇవ్వడంపై.. ఆశావహులు, ఇతర నేతలు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే టికెట్ల కేటాయింపులో తమ ప్రమేయం పెద్దగా లేదని, జాతీయ నాయకత్వమే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తోందని ముఖ్య నేతలు బదులిస్తున్నట్టు సమాచారం. -
తెలంగాణకు ప్రధాని రాక.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు నేపథ్యంలో... తెలంగాణలో బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వరుసగా శుక్ర, శని, సోమవారాల్లో వివిధ చోట్ల బహిరంగసభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్న మోదీ రాత్రికి రాజ్‌భవన్‌లో బసచేయనున్నారు. శనివారం ఉదయం నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. మళ్లీ 18న జగిత్యాలలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శుక్ర, శనివారాల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చనే అంచనాల మధ్య ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ ఇప్పటికే ఈ నెల 4న ఆదిలాబాద్‌లో, 5న పటాన్‌చెరువులో రూ.15వేల కోట్ల పైచిలుకు విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందా లేదా అన్న దానితో నిమిత్తం లేకుండా మోదీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయని పార్టీ వర్గాల సమాచారం. ఇదీ మోదీ షెడ్యూల్... ► శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు... ► రోడ్డుమార్గాన మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని రోడ్డుషో స్టార్టింగ్ పాయింట్‌కు... ► సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు మల్కాజిగిరిలో రోడ్డుషో ► రోడ్డుమార్గాన 6.40 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ► శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు ► మధ్యాహ్నం 12 నుంచి 12.45 గంటల దాకా అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు ► ఒంటిగంటకు నాగర్‌కర్నూల్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2.05 గంటలకు కర్ణాటకలోని గుల్బర్గాకు బయలుదేరుతారు. ► తిరిగి 18వ తేదీ రాష్ట్రానికి వస్తారు. ఆ రోజు షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది. ఔ నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు ప్రధాని మోదీ రెండు రోజుల నగర పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ విభాగం తెలిపింది. శుక్రవారం సాయంత్రం 4.40 నుంచి 7 గంటల మధ్య బేగంపేట, పీఎన్టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్‌రోడ్డు, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, రైల్వే హాస్పిటల్, మెట్టుగూడ రోటరీ, మీర్జాలగూడ టి–జంక్షన్, మల్కాజిగిరి ఆర్చి, లాలాపేట్, తార్నాక, గ్రీన్‌ల్యాండ్స్, మోనప్ప జంక్షన్, రాజ్‌భవన్, ఎంఎంటీఎస్ జంక్షన్, వీవీ విగ్రహం మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. ఆయా మార్గాల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించింది. అదేవిధంగా శనివారం ఉదయం 10.40 నుంచి 11.15 గంటల మధ్య ప్రధానమంత్రి రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఆ సమయంలో వీవీ విగ్రహం, మెట్రో రెసిడెన్షీ లేన్, ఎంఎంటీఎస్ రాజ్‌భవన్, పంజగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, హెచ్‌పీఎస్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పీఎన్టీ ఫ్లైఓవర్, ఎయిర్పోర్ట్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించింది. మోదీ రాక.. భద్రత కట్టుదిట్టం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల(నేడు, రేపు) నగర పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశా రు. మోదీ విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న నేపథ్యంలో దానిని కేంద్ర బలగాలు తమ ఆ«దీనంలోకి తీసుకు న్నాయి. ఎయిర్పోర్ట్ పరిసరాలను అణువణువూ జాగిలాలతో జల్లెడ పట్టాయి. ప్రధాని పయనించే మార్గాల్లో పోలీసులు గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. నేడే మోదీ రోడ్ షో పూర్తిచేసుకుని తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. శనివారం ఉద యం 10.40 నుంచి 11.15 మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాక్షి, సిటీబ్యూరో, మల్కాజిగిరి/ సనత్‌నగర్: మల్కాజిగిరిలో నేడు సాయంత్రం 5.15 గంటలకు జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ మరి కొద్దిరోజుల్లో వెలువడనున్న తరుణంలో ప్రధానమంత్రి రోడ్ షో బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపనుంది. మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నేతలు మల్కాజిగిరిలో రోడ్‌షో ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసేందుకు సన్నాహాక సమావేశాలు ఇ ప్పటికే ఏర్పాటు చేశారు. రోడ్ షో ఇలా... ► ప్రధాని మోదీ రోడ్ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి సాయంత్రం 5.15 గంటలకు ప్రారంభం కానున్నది. ► సుమారు 1.3 కి.మీ. దూరంలో ఉన్న మల్కాజిగిరి చౌరస్తా వరకు రోడ్‌షో జరుగుతుంది. ► మల్కాజిగిరి చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌కు ఏర్పాటు చేశారు. అక్కడ మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ► దారి పొడవునా సుమారు 60 స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ► ప్రజలతోపాటు పార్టీ నాయకులు స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ► రోడ్‌షోలో భాగంగా సుమారు ముప్ఫై కార్లతో కాన్వాయి ట్రయల్ రన్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన భద్రతాచర్యల్లో భాగంగా రోడ్ షో జరిగే ప్రాంతం చుట్టూ నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిర్ బెలూన్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్, ప్యారా గ్లైడింగ్‌లను నిషేధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రోడ్ షో ముగిసే వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. రహదారి మళ్లింపులు ఇలా.. ► మెట్టుగూడ నుంచి మీర్జాలగూడ క్రాస్ రోడ్, నేరేడ్మెట్ వైపునకు వచ్చే ప్రయాణికులు శాంతినగర్ టీ జంక్షన్ వద్ద మళ్లించి, లాలాపేట మీదుగా జెడ్‌టీసీ, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్ మీదుగా నేరేడ్మెట్కు చేరుకోవాలి. ► నేరేడ్మెట్, వినాయక్‌నగర్, సఫిల్‌గూడ జంక్షన్ మీదుగా మల్కాజ్గిరి క్రాస్ రోడ్స్‌కు వచ్చే వాహనదారులు ఆనంద్‌బాగ్ క్రాస్ రోడ్స్ వద్ద మలుపు తీసుకొని ఉత్తమ్ ఆర్యూబీ మీదుగా ఉత్తమ్ నగర్, ఏఓసీ రూట్, సికింద్రాబాద్ మీదుగా వెళ్లిపోవాలి. ► జెడ్‌టీసీ జంక్షన్ నుంచి ఆనంద్‌బాగ్‌కు వచ్చే వాహనాలు జెడ్‌టీసీ వద్ద మళ్లించి, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్, నేరేడ్మెట్, వినాయక్‌నగర్ మీదుగా వెళ్లిపోవాలి. పార్కింగ్లు ఇక్కడే.. రోడ్ షోకు హాజరయ్యేవారు తమ వాహనాలను అనుటెక్స్ పెట్రోల్ బంక్, అషూర్ఖానా మైదానం, ప్రశాంత్ నగర్, జైన్ కన్స్ట్రక్షన్, సఫిల్‌గూడ ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల లోపు పార్కింగ్ చేయాలి. ఆ సమయం తర్వాత పార్కింగ్ చేయడానికి అనుమతి లేదు. -
‘వల’స రాజకీయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘వల’స రాజకీయం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా సాగినట్టు కనిపిస్తోంది. బీజేపీ ఎంపిక చేసిన వారిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి వచ్చినవారే ఉండటం, అధికార కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తున్న సూచనలు ఉండటం దీనిని బలపరుస్తోంది. రెండు జాతీయ పార్టీలు కూడా ఇలా వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం బీఆర్ఎస్ శిబిరంలో కలవరం రేపుతోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటివరకు బీజేపీ 15, కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. బీజేపీ ప్రకటించిన 15 మందిలో ఐదుగురు ఇటీవల బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరినవారే. కాంగ్రెస్ మలి జాబితాలో బీఆర్ఎస్ నుంచి చేరిన ముగ్గురు లేదా నలుగురికి టికెట్లు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ ఈ నష్టాన్ని పూడ్చుకోవడంపై దృష్టి సారిస్తూనే దీటైన అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అదే సమయంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తు చర్చలు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో.. ప్రధాన పార్టీలన్నీ మిగతా అభ్యర్థుల ఎంపికను వేగిరం చేశాయి. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వలసల రాజకీయం మరింత ఊపందుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ అసంతృప్తులపై కాంగ్రెస్ ఫోకస్.. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచే బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవడంపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. పెద్దపల్లి లోక్‌సభ టికెట్‌ను ఆశిస్తూ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ ఆశించిన గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త మోతె శోభన్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు. చేవెళ్ల టికెట్‌ను ఆశిస్తూ మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి దంపతులు హస్తం గూటికి చేరారు. ప్రస్తుతం వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్‌గా ఉన్న మహేందర్‌రెడ్డి భార్య సునీతకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఓ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి రప్పించి భువనగిరి టికెట్ ఇవ్వనున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ నల్గొండ ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి ఇటీవల సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో భేటీకావడం గమనార్హం. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ప్రకటించినా.. బెంగళూరు వేదికగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి భేటీపై చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే నాటికి మరిన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కేవలం బీఆర్ఎస్ నుంచే కాకుండా బీజేపీ అసంతృప్తులపైనా కాంగ్రెస్ దృష్టి సారించింది. మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో సీఎం రేవంత్ భేటీ కావడమే దీనికి సంకేతమని అంటున్నారు. కమలం గూటికి తాజా, మాజీ గులాబీలు ప్రస్తుత పార్లమెంటు చివరి సమావేశాలు జరుగుతున్న సమయంలో.. గత నెల మొదటి వారంలోనే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పి.రాములు (నాగర్‌కర్నూల్) బీబీ పాటిల్ (జహీరాబాద్) కాషాయదళంలో చేరారు. రాములు కుమారుడు భరత్‌కు, బీబీ పాటిల్‌కు వెంటనే బీజేపీ ఎంపీ టికెట్లు లభించాయి. మాజీ ఎంపీలు గోడెం నగేశ్ (ఆదిలాబాద్), సీతారాంనాయక్ (మహబూబాబాద్)తో పాటు మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి (నల్గొండ)కు పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే బీజేపీ అభ్యర్థిత్వం దక్కింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను పార్టీలో చేర్చుకుని వరంగల్ టికెట్ ఇచ్చే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అయితే లోకసభ అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారే బీజేపీలో చేరుతుండగా.. అసెంబ్లీ, ఆ దిగువస్థాయి నుంచి బీజేపీలోకి పెద్దగా చేరికలు కనిపించడం లేదు. ప్రధాని మోదీ చరిష్మా, రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్షం బీఆర్ఎస్లపై ఉన్న వ్యతిరేకతకుతోడు ప్రధాని మోదీ చరిష్మా, రామ మందిర నిర్మాణం వంటి అంశాలు తమకు లాభిస్తుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వరుస పర్యటనలు ఉన్న నేపథ్యంలో కింది స్థాయిలోనూ ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక.. బీఎస్పీతో పొత్తులు రెండు జాతీయ పార్టీలు ‘వల’సలతో ఇబ్బందిపెడుతున్నా.. దీటుగా ఎదుర్కొనేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తూనే.. బీఎస్పీతో పొత్తు అంశాన్ని వ్యూహాత్మకంగా తెరమీదికి తీసుకువచ్చారు. బీఆర్ఎస్కు ప్రస్తుతమున్న 9 మంది సిట్టింగ్ ఎంపీల్లో ఇప్పటికే ముగ్గురు పార్టీని వీడగా.. మరో ఇద్దరు రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), పసునూరు దయాకర్ (వరంగల్) పోటీకి దూరంగా ఉన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్) ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎంపీ పోటీకి దూరమయ్యారు. దీనితో సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురు మన్నె శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్‌నగర్), మాలోత్ కవిత (మహబూబాబాద్), నామా నాగేశ్వర్రావు (ఖమ్మం) మాత్రమే తిరిగి బీఆర్ఎస్ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉండి, పలుకుబడి ఉన్న ఎంపీలు, ఇతర కీలకనేతలను కాంగ్రెస్, బీజేపీ చేర్చుకుంటుండటంతో.. ఆయా స్థానాల్లో ప్రత్యామ్నాయంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఆర్ధిక స్థోమత కలిగి, పోటీకి ఆసక్తి చూపుతున్న నేతలను, సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న వారిని పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. సీనియారిటీ ఆధారంగా కడియం శ్రీహరి (ఆయన కుమార్తె కావ్యకు వరంగల్), బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్), కొప్పుల ఈశ్వర్ (పెద్దపల్లి), బోయినపల్లి వినోద్‌కుమార్ (కరీంనగర్), ఆత్రం సక్కు (ఆదిలాబాద్)లకు టికెట్లు ఇచ్చారు. ఆర్ధిక బలం, స్థానికత తదితరాల ప్రాతిపదికగా కాసాని జ్ఞానేశ్వర్ (చేవెళ్ల), గాలి అనిల్‌కుమార్ (జహీరాబాద్), రాగిడి లక్ష్మారెడ్డి (మల్కాజిగిరి)ని ఎంపిక చేశారు. ఇక పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్‌కర్నూల్ స్థానం కేటాయించేందుకు బీఆర్ఎస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక పార్టీ నుంచి కొనసాగుతున్న వలసతో జరిగే నష్టాన్ని పూడ్చుకోవడంపైనా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత, త్రిముఖ పోటీ కలసి వస్తుందని పేర్కొంటున్నారు. -
BRS Party: మల్కాజ్గిరి, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మరో రెండు లోక్‌సభ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫైనల్ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీరిద్దరి పేర్లను అధికారికంగా నేడు వెల్లడించింది బీఆర్ఎస్. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ నేడు భేటీ అయ్యారు.. నందినగర్‌లోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై చర్చించారు. ఈఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ మంత్రులు వేణుగోపాలచారి, జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. అయితే కేసీఆర్ సమావేశానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ భేటీలోనే రెండు పార్లమెంట్ స్థానాల అభ్యర్ధి ఎంపిక విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నగేష్ ఇటీవలే బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపురావును కాదని కాషాయ పార్టీ నగేష్‌కు టికెట్ కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు లోక్ సభ టికెట్ కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రకటించిన పార్లమెంటు స్థానాలు 1) ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు 2) మహబూబాబాద్ -(ఎస్టీ) మాలోత్ కవిత 3) కరీంనగర్ - బోయినపల్లి వినోద్ కుమార్ 4)పెద్దపల్లి(ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్ 5) మహబూబ్ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి 6) చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ 7) వరంగల్ (ఎస్సీ)-డాక్టర్ కడియం కావ్య 8 ) జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్ 9) నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి -
మళ్లీ పోటీ చేయను.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని.. ఇవే తనకు చివరి ఎన్నికలని తెలిపారు. పార్టీ మారనున్నారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్నదంతా అసత్య ప్రచారమని అన్నారు. కాగా మల్లారెడ్డి గురువారం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, తనయుడు భద్రారెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ మళ్లీ పుకార్లు గుప్పుమన్నాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో డీకేను కలిసినట్లు తెలిపారు. తన మిత్రుడుకి సంబంధించిన యూనివర్సిటీ కొనుగోలు కోసం మాట్లాడేందుకు మాత్రమే వెళ్ళానట్లు పేర్కొన్నారు. ఓ మధ్యవర్తితో డీకేశివకుమార్ వద్దకు వెళ్లిన్నట్లు మల్లారెడ్డి చెప్పారు. రెండు రోజుల కింద కలిశానని.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. శివకుమార్ తనకుకు మిత్రుడని పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని.. తమ కుటుంబ సభ్యులు వేరే పార్టీల నుంచి పోటీచేయరన్నారు. ఈ ఐదేళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. చదవండి: తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్ -
బీఆర్ఎస్కు బిగ్ షాక్!.. డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి మంతనాలు
సాక్షి, బెంగుళూరు: మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి.. ఆయన అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ హోటల్లో డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపారు. రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అపాయింట్మెంట్ కోరారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. తప్పుడు ప్రచారమంటూ తీవ్రంగా ఖండించిన మల్లారెడ్డి.. తాను కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదంటూ, బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంతలోనే హఠాత్ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి, ఆయన అల్లుడు భేటీ కావడం, మంతనాలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రియాంక గాంధీ సమక్షంలో మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొలిటికల్ హైడ్రామా.. BRSకు షాకిచ్చిన ఆరూరి రమేష్ -
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి ఆశించారు. మొదటి నుంచి ఇక్కడ పోటీ చేయాలని జితేందర్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రం జితేందర్ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది. దీంతో, టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి భంగపాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదు. తన అన్న ఇంటికి వచ్చాడు అంతే. మాది ఒక్కటే జిల్లా. నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడు. నేను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నాను. బీజేపీలో సంతోషంగానే ఉన్నాను. నా సీటు గురించి అధిష్టానం చూసుకుటుంది. కాంగ్రెస్‌లో టికెట్లు ఫుల్ ఫిల్ అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో వంశీ, చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌కు ఉన్నారు. పార్టీలోకి సీఎం రేవంత్ నన్ను ఆహ్వానించలేదు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. కేవలం పరామర్శ కోసమే రేవంత్ మా ఇంటికి వచ్చాడు అని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ కేంద్ర పెద్దలపై జితేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. జితేందర్ రెడ్డి గతంలో బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్ చేసి పలు సెటైరికల్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇటీవల కూడా ఒక వీడియోను షేర్ చేయడంతో బీజేపీ నేతలు ఖంగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ జితేందర్ రెడ్డి సీటు నిరాకరించినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. CM Revanth Reddy met former MP BJP leader Jithender Reddy at his residence.#RevanthReddy • @revanth_anumula • @apjithender • @mpponguleti • @Drpmahendereddy pic.twitter.com/biQVwz2R3w — Congress for Telangana (@Congress4TS) March 14, 2024 -
పొలిటికల్ హైడ్రామా.. BRSకు షాకిచ్చిన ఆరూరి రమేష్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు జెట్ స్పీడ్ వేగంతో మారిపోతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన ఏ క్షణంలోనైనా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, ఆరూరి విషయంలో నిన్న(బుధవారం) హైడ్రామా జరిగింది. ఆరూరి బీజేపీలో చేరుతున్నాయనే సమాచారం రావడంతో ఆయన ఇంటికి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సహా పలువురు నేతలు వెళ్లారు. అనంతరం, నాటకీయ పరిణామాల మధ్య ఆరూరిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆరూరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో ఆరూరి మాట్లాడినా ఆయన కాంప్రమైజ్ కాలేదు. దీంతో, ఆరూరి బీఆర్ఎస్ను వీడాలని నిర్ణయించుకున్నారు. ఇక, అంతకుముందే ఆరూరి.. బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ కోసం ఆరూరి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని ఏ క్షణంలోనైనా ఆరూరి కలిసే అవకాశం ఉంది. అనంతరం, ఆరూరి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
కేసీఆర్ అన్న కొడుకుపై కేసు నమోదు.. కారణం ఇదే..
సాక్షి, ఆదిభట్ల: తెలంగాణలో భూ కబ్జాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుతో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో, ఈ భూ కబ్జా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, అతడి గ్యాంగ్ ప్రయత్నించినట్టు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ అంశంపై ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో కన్నారావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు. ఇక, బాధితుల ఫిర్యాదులో తమ భూమి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్ళు పెట్టినట్టు పేర్కొన్నారు. దీంతో, కన్నారావుతో పాటు అతని అనుచరులు బీఆర్ఎస్ నాయకులు 38 మందిపై 307,447,427.,436,148,149 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 38 మందిలో ముగ్గురని పోలీసులు రిమాండ్‌లోకి తీసుకోగా మరో 35 మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు. కాగా, కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కన్నారవు బెంగుళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. -
పారాచూట్లకే ప్రాధాన్యం!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీచేసే మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం రెండో జాబితాను విడుదల చేసింది. తొలిజాబితాలో 9 మంది పేర్లను, తాజాగా ఆరుగురి పేర్లను ప్రకటించడంతో.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. వరంగల్, ఖమ్మం స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన పారాచూట్ నేతలకు ఎంపీ టికెట్లు ఇవ్వడం ఏమిటంటూ బీజేపీలో అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నాయి. సగందాకా ‘పారాచూట్ల’కే! ఇప్పటివరకు ప్రకటించిన 15 మంది అభ్యర్థులలో ఏడుగురు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారేనని (ఒకరు పార్టీలో కూడా లేనివారు) పలువురు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. పెండింగ్‌లోని ఖమ్మం, వరంగల్ స్థానాలను కూడా బీఆర్ఎస్ నుంచి చేరేందుకు సిద్ధపడ్డవారికే ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతోందని చెప్తున్నారు. అంటే 17 సీట్లలో 9 స్థానాలను (సగానికిపైగా) బయటి నుంచి వచ్చిన వారికే కేటాయిస్తే.. ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నవారి పరిస్థితి ఏమిటని వాపోతున్నారు.ఇన్నాళ్లూ తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరగానే ఎంపీ టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెండో జాబితాలో డీకే అరుణ, రఘునందన్‌రావు మినహా మిగతా నలుగురు సైదిరెడ్డి, సీతారాంనాయక్, గోడెం నగేశ్, గోమాస శ్రీనివాస్ ఇతర పార్టీల నుంచి వచ్చినవారేనని అంటున్నారు. తొలిజాబితాలో ప్రకటించిన ఎంపీ బీబీ పాటిల్ (జహీరాబాద్), ఎంపీ పి.రాములు కుమారుడు భరత్ (నాగర్‌కర్నూల్) బీఆర్ఎస్ నుంచి వచ్చారని.. పార్టీలో కూడా చేరని మాధవీలతకు హైదరాబాద్ టికెట్ ఇచ్చారని పేర్కొంటున్నారు. అయితే పార్టీపరంగా బలమైన అభ్యర్థులు లేని ఎంపీ సీట్లలో గెలుపు ప్రాతిపదికగా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి జాతీయ నాయకత్వం టికెట్లు కేటాయించిందంటూ కొందరు పార్టీ ముఖ్యనేతలు సమర్థిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు చెప్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ అన్నీ వారికేనా? రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఆ స్థానాలను పార్టీలో ముందు నుంచీ ఉన్నవారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడం ఏమిటని అంతర్గతంగా విమర్శలు వస్తున్నాయి. ఈ మూడు సీట్లను మాదిగ సామాజికవర్గానికి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించడంతోపాటు ఇప్పటికే రెండు టికెట్లను (నాగర్‌కర్నూల్, పెద్దపల్లి) వారికే ప్రకటించడం పట్ల పార్టీలోని మాల సామాజికవర్గ నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి కనిపిస్తోంది. పెండింగ్‌లో పెట్టిన వరంగల్ (ఎస్సీ) సీటును కూడా మాదిగలకే కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీజేపీలో చేరి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా.. బీఆర్ఎస్ నేతలు తాత్కాలికంగా అడ్డుకున్నారని కాషాయ వర్గాలు అంటున్నాయి. వరంగల్ టికెట్‌ను బీఆర్ఎస్ కడియం కావ్యకు ఇచ్చిన నేపథ్యంలో.. అరూరి రమేశ్ బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఇంకా అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. -
సరైన అభ్యర్థులు లేకనే.. బీఆర్ఎస్ వారిని బీజేపీ చేర్చుకుంటోంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదరణ ఉండబోదని.. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీని చూపి ఏదో హడావుడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బీజేపీకి సరైన అభ్యర్థులు దొరకనందునే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఇతర నేతలను చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తల బలగం లేదని.. అందుకే అరూరి రమేశ్ వంటి నేతలను చేరాలని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బుధవారం హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో సమావేశమయ్యారు. అక్కడి తాజా రాజకీయ స్థితిగతులు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై చర్చించారు. పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. వివరాలు కేసీఆర్ మాటల్లోనే.. ‘‘దూరపు కొండలు నునుపు అన్నట్టు బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీల్లో చేరుతున్న నేతలకు అక్కడ పెద్దగా ఆదరణ ఏమీ ఉండదు. బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవడం ద్వారా తమ బలం పెరిగిందనే ప్రచారం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. అందుకే కండువాలు కప్పి తమ వారు అనిపించుకునేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు నిజంగా బలముంటే వారి పార్టీల్లోనే అభ్యర్థులు ఎందుకు దొరకడం లేదు? బీజేపీ తాజాగా ప్రకటించిన జాబితాలో ఒక్కరైనా ఆ పార్టీలో పుట్టి పెరిగిన నేతలున్నారా? భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అసాధ్యమని ప్రజలకు అర్థమవుతోంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ బీఫారం ఇస్తే చాలు గెలుపు ఖాయమనే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరుగుతోంది క్షేత్రస్థాయిలో సాగునీరు, విద్యుత్, తాగునీటికి సమస్యలు నెలకొన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. కాంగ్రెస్ సర్కారుపై పెరుగుతున్న ఈ ప్రజా వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు బీఆర్ఎస్ ముఖ్యులు, మాజీ ఎమ్మెల్యేలు కలసికట్టుగా పనిచేయాలి..’’అని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాగా.. వరంగల్ లోక్‌సభ స్థానంలో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థి ఎవరైతే బాగుంటుందన్న దానిపై భేటీకి హాజరైన నేతలను కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ భేటీలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వినయ్‌భాస్కర్, నరేందర్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. -
మరో నలుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య, జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్‌కుమార్, నిజామాబాద్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్థన్‌లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా నలుగురు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా తొమ్మిదికి చేరింది. ఇంకా 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించాల్సి ఉంది. కాగా, తొలి జాబితాలో బీఆర్ఎస్. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, )మహబూబ్ నగర్-మన్నె శ్రీనివాస్ రెడ్డిలను ఖరారు చేసింది. ఇదీ చదవండి: బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు -
బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్ధులతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం గురువారం విడుదల చేసింది. ఇటీవల హర్యానా సీఎం పదవికి అనూహ్య రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్‌తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును కూడా ప్రకటించింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో ఆరుగురు పేర్లను ఖరారు చేసింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది, రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఈ జాబితాలో తెలంగాణ (6)తో పాటు దాద్రానగర్ హవేలీ (1) ఢిల్లీ (2), గుజరాత్ (7), హరియాణా(6), హిమాచల్‌ప్రదేశ్(2), కర్ణాటక (20), మధ్యప్రదేశ్ (5), మహారాష్ట్ర(20),, త్రిపుర (1), ఉత్తరాఖండ్ (2) రాష్ట్రాల్లో చొప్పున అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులు.. మహబూబ్‌నగర్: డీకే అరుణ మెదక్: రఘునందన్ రావు ఆదిలాబాద్: నగేష్ మహబూబాబాద్ : సీతారాం నాయక్ నల్గొండ : శానం సైదిరెడ్డి పెద్దపల్లి: గోమాస శ్రీనివాస్ రెండో జాబితాలో ప్రముఖులు బీజేపీ రెండో జాబితాలో పలువురు కేంద్ర మంత్రుల పేర్లను కూడా ప్రకటించింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్, కేంద్ర సమాచారం బ్రాడ్‌కాస్టింగ్ శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు అవకాశం ఇచ్చింది. వీరితోపాటు కర్ణాటక మాజీ సీఎం, షిగ్గావ్ ఎమ్మెల్యే బసవరాజ్ బొమ్మెకు ఈసారి ఎంపీగా చాన్స్ ఇచ్చింది. హవేరి నుంచి ఆయన లోక్‌సభ బరిలో దిగుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి మాజీ సీఎం త్రివేంద్రసింగ్రావత్ బరిలో నిలిపింది. నితిన్ గడ్కరీ- నాగ్‌పూర్(మహారాష్ట్ర) పీయూష్ గోయల్- ముంబై నార్త్(మహారాష్ట్ర) ప్రహ్లాద్ జోషి, ధార్వాడ్(కర్ణాటక) అనురాగ్ ఠాగూర్- హమిర్పూర్( హిమాచల్ ప్రదేశ్) మనోహర్‌లాల్ ఖట్టర్- కర్నాల్( హర్యానా) లోక్‌సభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. -
‘నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు.. బీఆర్ఎస్లోనే ఉన్నా’
సాక్షి, హైదరాబాద్: గత రెండు రోజులుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. ఆయన బీఆర్ఎస్ పార్టీ మారి బీజేపీలో చేరుతున్నారని చర్చ జరిగింది. ఆయన పార్టీ మార్పుపై వరంగల్‌లో ఈరోజు హైడ్రామా కొనసాగింది. ఏకంగా ఆయన్ను బీజేపీలో చేరకుండా బీఆర్ఎస్ నాయకులే కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరూరి.. బీఆర్ఎస్ పార్టీ సీనియర్‌నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మీడయాతో మాట్లాడారు. ‘బీఆర్ఎస్లోనే కోనసాగుతున్నా. అమిత్ షాను కలవలేదు.. కానీ, బీజేపీ నాయకులను మాత్రమే కలిశాను. మా పార్టీ నేతలే నన్ను తీసుకుని వచ్చారు. నన్ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయలేదు. మా పార్టీ నేతలు నన్ను కిడ్నాప్ ఎందుకు చేస్తారు?’ అని ఆరూరి స్పష్టత ఇచ్చారు. -
లోక్‌సభ ఎన్నికల పోటీపై ఆరూరి ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఏం కేసీఆర్ సమావేశం ముగిసింది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేరును పార్టీ నేతలు ప్రతిపాదించగా.. ఆయన పోటీకి విముఖత చూపించారు. మరోసారి అవకాశం ఇవ్వాలని సిట్టింగ్ ఎంపీ దయాకర్ కోరగా.. త్వరలోనే నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ బదులిచ్చారు. అటు అనవసర నిర్ణయాలతో భవిష్యత్ పాడు చేసుకోవద్దని పార్టీ మారాలని ప్రయత్నిస్తున్న ఆరూరి రమేశ్‌కు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. భేటీకి ముందు బీజేపీ చేరినట్లు వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పందించారు. ‘నేను ఏ బీజేపీ నేతలను కలవలేదు. మా పార్టీ నేతలే నన్ను తీసుకుని వచ్చారు. నన్ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయలేదు. మా పార్టీ నేతలు నన్ను కిడ్నాప్ ఎందుకు చేస్తారు?’అని ఆరూరి తెలిపారు. అయితే గత రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారతున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై ఉదయం నుంచి వరంగల్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆరూరి రమేష్‌ను బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబల్లి దయాకర్‌రావు హైదరాబాద్ తీసుకురావటంతో ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. -
BRS: ఆరూరి ఇంటి వద్ద హైడ్రామా.. బీజేపీ నేతలు సీరియస్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రెడీ కావడంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా క్రియేట్ అయ్యింది. రంగంలోకి దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆయనను తన కారుతో వేరే చోటకు తరలించారు. ఇక, పరిణామాలపై బీజేపీ నేత సీతారాం నాయక్ స్పందించారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరూరి రమేష్ ఇంటి వద్ద చోటుచేసుకున్న పరిణామాలు నాటకీయంగా ఉన్నాయి. నిన్న(మంగళవారం) అమిత్ షాను కలిసి బీజేపీలో చేరేందుకు రమేష్ రెడీ అయ్యారు. ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీలో జాయిన్ అవుతున్నా అని ప్రకటిస్తున్నానని మాకు చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వెళ్లి ప్రవర్తించిన తీరు సరికాదు. రమేష్ తన ఇష్టంతో సొంత నిర్ణయం తీసుకుంటే వీరికి వచ్చిన బాధేంటి?. బీఆర్ఎస్ నేతలు రమేష్ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ డ్రామాలన్నీ ప్రజలు చూస్తున్నారు. గతంలో నా రాజకీయ జీవితం కూడా బీఆర్ఎస్ నేతలే నాశనం చేశారు. నాకు BRS చేసిన అన్యాయంపై 151 బుక్స్ రాయవచ్చు. దళితులకు వీళ్ళు గతంలో ఏమి చేశారని ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ వాళ్లు ఎం హామీ ఇస్తారు?. గతంలో ఎప్పుడైనా ఆరూరికి ఎర్రబెల్లి మద్దతుగా ఉన్నాడా?. ఆరూరి జీవితంతో ఎర్రబెల్లి, బీఆర్ఎస్ నేతలు ఆడుకోవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘అది ఓ ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా?’
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాంబుల భాష వాడడం అంత బాగోలేదని చెప్పాలి. 'ఎవడన్న టచ్ చేసి చూడండి.. మా పాలమూరు బిడ్డలు అగ్ని కణితలైతరు. మానవ బాంబులైతరు..ఎవడన్నా మిగుల్తాడేమో నేను చూస్తా"అని రేవంత్ హెచ్చరించారు.ఆ తర్వాతత మరో సభలో ఫామ్ హౌస్ ఇటుకలు కూడా మిగలవని అన్నారు. రేవంత్ కు ఎందుకు ఇంత అసహనం. కేవలం ప్రజల సానుభూతి కోసమే ఈ ప్రయత్నమా? లేక నిజంగానే ఆయన ప్రభుత్వాన్ని ఎవరైనా టచ్ చేస్తారని, తన సీఎం సీటుకు గండం వస్తుందని భయపడుతున్నారా? నిజానికి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నుంచి ఎవరూ పార్టీ మారలేదు. పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ఆయనను కలవడం అనుమానంగా ఉంది. అయినా రేవంత్ ఇలా మాట్లాడుతున్నారంటే ఏమని అనుకోవాలి. నిజమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ఏర్పాటు, అసమ్మతి, ప్రభుత్వాలు పడిపోవడం జరుగుతోంది. అదేమి కొత్త విషయం కాదు. దానిని సమర్ధించడం లేదు. కాని తన ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పాలమూరు బిడ్డలు మానవ బాంబులు అవుతారని అనడం మాత్రం అభ్యంతరకరం. మీ రాజకీయ క్రీడలోకి సామాన్య కార్యకర్తలను లాక్కురావడం దేనికో తెలియదు. విశేషం ఏమిటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి వెళ్లి రేవంత్ అరెస్టు అయ్యారు. అప్పుడు అదంతా కుట్ర అని రేవంత్ చెబుతారు. అది కుట్రనా , కాదా, అన్నది పక్కనబెడితే ఏభై లక్షల నగదు ఎందుకు ఆ ఎమ్మెల్యే వద్దకు తీసుకు వెళ్లారో వివరణ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఈ కేసు కోర్టు విచారణలోనే ఉంది.అయినా అదృష్టవశాత్తు రేవంత్ ముఖ్యమంత్రి స్థాయికి రాగలిగారు. అంతవరకు సంతోషమే. కాని ఇప్పుడు ఇలా మాట్లాడడం పద్దతి అనిపించదు. నిజంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టే అంత సీన్ ఉన్నట్లు కనిపించదు. బీజేపీ వారు పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ప్రచారం చేస్తున్నప్పటికి అది అంత తేలిక కాదు. అదేదో రాజకీయ విమర్శ మాదిరి, పార్లమెంటు ఎన్నికలలో లబ్ది పొందడానికి ఎవరికి వారు ఆరోపణలు చేసుకుంటూ కధ నడుపుతున్నారు. ఎప్పుడు రేవంత్ ప్రభుత్వానికి చిక్కులు వస్తాయి?తెలంగాణలో కాంగ్రెస్ కు ఉన్న మెజార్టీ కేవలం నాలుగు సీట్లే. మిత్రపక్షం సిపిఐ కి ఉన్న మరో సీటు కూడా కలిపితే ఐదు సీట్ల మెజార్టీ ఉన్నట్లు. కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మూడు సీట్ల మెజార్టీనే వచ్చింది. ఓటు కు నోటు కేసు తర్వాత ఆయన పలువురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లోకి లాగారు. అది విమర్శలకు గురైనా ఆయన అదే రీతిలో ముందుకు వెళ్లారు. 2018లో మంచి మెజార్టీతో కెసిఆర్ అదికారంలోకి వచ్చినా మళ్లీ అదే పద్దతి అవలంభించారు.దాని వల్ల కేసీఆర్ కు కొంత అప్రతిష్ట వచ్చింది. 2014లో కాంగ్రెస్ కు 21సీట్లు, టీడీపీ,బీజేపీ కూటమికి 20 సీట్లు రావడం వల్ల కేసీఆర్ కు అంత ఇబ్బంది రాలేదు. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు కూడా అదే తరహా కంపోజిషన్ ఉందని చెప్పాలి. బీఆర్ఎస్ కు 39 సీట్లు వస్తే, బీజేపీకి ఎనిమిది, ఎంఐఎంకు ఏడు సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ , బీజేపీ కలిసినా నలభైఏడు సీట్లే అవుతాయి.కాని ఇప్పటికిప్పుడు ఈ రెండు పార్టీల మద్య అవగాహన కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ కలిసినా ఆ సంఖ్యతో కాంగ్రెస్ కు ధ్రెట్ అవడం కష్టం. ఎంఐఎం నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండక పోవడం కూడా కాంగ్రెస్ కు కలిసి వస్తుంది. బీజేపీ మినహా ఎవరు అధికారంలో ఉంటే వారివైపు వెళ్లడానికి ఎంఐఎం ప్రాధాన్యత ఇస్తుంటుంది.ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసిని ప్రోటెం స్పీకర్ ను చేయడం, లండన్ పర్యటనకు ఆహ్వానించడం తదితర చర్యల ద్వారా ఆ పార్టీవారిని తమ వైపు అవసరమైతే ఉండేలా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది. అయినా రేవంత్ ఎందుకు సీరియస్ ప్రకటనలు చేస్తున్నారు?అంటే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ కు ఆశించిన సీట్లు రాకపోతే సొంత పార్టీలోనే కొత్త కుంపట్లు వస్తాయని ఆయన భయపడుతుండవచ్చు.దానిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి తనకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకునే యత్నం చేస్తున్నారనుకోవాలి.అలాగే పార్లమెటు ఎన్నికలలో కరువు, నీటి సమస్య, నెరవేరని హామీలు చర్చకు రాకుండా రేవంత్ ఈ మానవ బాంబుల భాష వాడి ఉండవచ్చు. రేవంత్ అక్కడితో ఆగలేదు..ఒక్కొక్కడిని పండబెట్టి తొక్కి పేగులు తీస్కొని మెడల వేస్కుని ఊరేగుతాం బిడ్డా ఎవడన్నా ఈ ప్రభుత్వం మీదకు వస్తే.. .అంటూ తీవ్రంగా హెచ్చరింకలు చేశారు. కొద్ది రోజుల క్రితం ప్రతిపక్షనేత ,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా రేవంత్ మాట్లాడి ఉండవచ్చు.వచ్చే పదేళ్లు అధికారంలో ఉంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న ఆయన మానవ బాంబుల గురించి ప్రస్తావించవలసిన అవసరం ఏమి ఉంటుంది?ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎవరైనా సామాన్య కార్యకర్త తొందరపడితే ఎంత ప్రమాదం!దానికి రేవంత్ బాధ్యత వహిస్తారా? తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక నాయకుడు పెట్రోల్ పోసుకోబోతున్నట్లు ప్రయత్నించిన సన్నివేశంపై ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికి తెలుసు. ఆ తర్వాత మరికొందరు అదే ప్రయత్నం చేశారు. చివరికి శ్రీకాంతాచారి ఆ నిప్పుకే బలైపోయారు.ఎంత దారుణం. మానవత్వం ఉన్నవారెవరూ ఇలాంటివాటిని సమర్ధించరాదు.రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కొంత ఆవేశంగా మాట్లాడేవారు. కొన్నిసార్లు ఆంద్రులను ఉద్దేశించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అదంతా గతం.ఇంకో సంగతి చెప్పాలి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మానవ బాంబుకే బలైపోయారు.అది అత్యంత దురదృష్టకర ఘటన . శ్రీలంక ఉగ్రవాదులు చేసిన ఘాతుకం అది.దేశంలో పలువురు ప్రముఖులు బాంబులు పేలిన ఘటనలలో మరణించారు. వాటి గురించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ప్రస్తావించడం ఏ మాత్రం సహేతుకం కాదని స్పష్టంగా చెప్పాలి. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ప్రముఖ నేతలు ఎవరూ రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి ఫోటో లేకుండా ప్రచార ప్రకటనలు వస్తున్నా ఆయన కూడా నోరెత్తలేదు. అలాగే మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కూడా రేవంత్ కు అసమ్మతిగా మారలేదు. కాస్తా,కూస్తో గతంలో రేవంత్ కు పార్టీలో ప్రత్యర్ధిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మంత్రి అయిన తర్వాత తన బాణీ మార్చుకున్నారు. రేవంత్ ను తెగ పొగుడుతున్నారు.అందువల్ల రేవంత్ కు వచ్చిన తక్షణ ప్రమాదం కనిపించదు. అయితే కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. మరో వైపు రేవంత్ ప్రధాని మోడీని బడా బాయి అని అనడం ఆధారంగా బిఆర్ఎస్ నేత కెటిఆర్ తదితరులు విమర్శలు గుప్పించారు. ఇందులో రేవంత్ ను పెద్దగా తప్పు పట్టనక్కర్లేదు. ప్రధానిని గౌరవించడం సంస్కారమే.కాని మరీ బంధం ఎక్కువగా ఉందేమో అన్న చందంగా పద ప్రయోగం చేస్తే కాంగ్రెస్ లోనే అనుమానం రావచ్చు. అందుకే ఆ తర్వాత మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా అంత సముచితంగా లేవు. కాగా కేసీఆర్ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తో ఒప్పందం చేసుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. దీనిపై రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు ఘాటైన విమర్శలే చేశారు. పదేళ్లు మాదిగలను వంచించి మోసగించిన దొర దగ్గరకు వెళ్లడం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కు న్యాయమా?అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ ఆశ్చర్యకరమైన రీతిలోనే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పాలి. దీని వల్ల ఆయన పార్టీ బలహీనపడిందన్న సంకేతాన్ని ఇచ్చినట్లయింది. బహుశా దళిత ఓట్లను ఆకర్షించడానికి ఈ పొత్తు పెట్టుకుని ఉండవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు సిపిఐ,సిపిఎం వంటి పార్టీలతో వ్యవహరించిన తీరు విమర్శలకు గురి అవుతుండేది. మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాల మద్దతు తీసుకుని, సాధారణ ఎన్నికలలో వారిని పట్టించుకోకపోవడం వల్ల కేసీఆర్ కు నిలకడ లేదన్న అభిప్రాయానికి తావిచ్చారు. ఇప్పుడు బిఎస్పితో ఎంతకాలం పొత్తు ఉంటుందన్నది చూడాలి. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి అయినా, మరొకరు అయినా బాంబుల భాష వాడకుండా ఉంటే మంచిది. ప్రస్తుత రాజకీయ వేడిలో ఇలాంటి హితోక్తిలను నేతలు వినే పరిస్థితి ఉండడం లేదు. అయినా మనం చెప్పవలసింది చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఆరూరి కోసం కొట్లాట.. చిరిగిన చొక్కా
హనుమకొండ, సాక్షి: నగరంలో ఇవాళ పొలిటికల్ హైవోల్టేజ్ హైడ్రామా నడిచింది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ను వీడి.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ నేతల ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. సీనియర్ నేత హరీష్‌రావు ఆదేశాల మేరకు బస్వరాజు సారయ్య, సుందర్ రాజ్ యాదవ్, ఇతర పార్టీ నేతలు బుధవారం ఉదయం ప్రశాంత్‌నగర్‌లోని ఆరూరి ఇంటికి వెళ్లారు. ప్రెస్మీట్లో పాల్గొననీయకుండా ఆరూరిని అడ్డుకున్నారు. హరీష్‌రావు పంపిస్తే తాము వచ్చామని చెబుతూ.. ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడించారు. కోరింది ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆరూరికి సర్దిచెప్పే యత్నం చేశారు. ఆ సమయంలో.. ఆరూరి అనుచరులు బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు బలవంతంగా ఆరూరిని బుజ్జగించే యత్నం చేశారు. ‘‘చివరి నిమిషంలో వస్తే ఎలా?’’ అని ఆరూరి ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టకున్నారు. అయితే హరీష్‌రావు సాయంత్రం వచ్చి అన్నీ మాట్లాడతారంటూ ఆరూరితో చెప్పారు వాళ్లు. అలా వాళ్లతో మాట్లాడిన కాసేపటికి అక్కడికి వచ్చిన ఎర్రబెల్లి కారులో ఆరూరి ఎక్కారు. అయితే ఆ సమయంలోనూ ఆరూరి అనుచరులు ఆ వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆరూరి నిలువరించడంతో వాళ్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వరంగల్ ఎంపీ సీటు కండిషన్‌పై బీజేపీలో చేరేందుకు ఆరూరి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆరూరిని కిడ్నాప్ చేశారు ఆరూరి రమేష్‌ను తమ వెంట బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లడంపై బీజేపీ నేత రావు పద్మ స్పందించారు. ఆయన్ని బీఆర్ఎస్ కిడ్నాప్ చేసిందని ఆరోపిస్తున్నారామె. ‘‘ఆరూరి బీజేపీలో చేరతానని నిన్న స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిశాక.. ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకుంటానని అన్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయడం కరెక్ట్ కాదు’’ అని పద్మ మండిపడ్డారు. పెంబర్తిలో ఉద్రిక్తత జనగాం జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరూరిని తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు ఆయన్ని తమ వెంట తీసుకెళ్లేందుకు యత్నించాయి. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో కారు నుంచి ఆరూరిని బయటకు లాగేందుకు బీజేపీ నేతలు యత్నించారు. అయితే బీఆర్ఎస్ నేతలు సైతం ఆరూరిని లాగేయడంతో.. జరిగిన తోపులాటలో ఆరూరి చొక్కా చినిగిపోయింది. ఎలాగోలా వాహనం నుంచి బయటకు వచ్చిన ఆరూరిని .. ఇరు వర్గాలు తమ తమ నేతలకు ఫోన్లు కలిపి కోరుతున్న దృశ్యాలు అక్కడ కనిపించాయి. -
కాంగ్రెస్‌లో చేరికకు రెడీ.. బీఆర్ఎస్ నేతకు చెప్పుదెబ్బ షాక్
సాక్షి, వరంగల్: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇటు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరాలనుకున్న ఓ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ సదరు నేతను చుక్కలు చూపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో పీఏసీఎస్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు. దీంతో, రెండు నెలల క్రితమే బీఆర్ఎస్.. మోహన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో, తాజాగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇక, మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇన్ని రోజులు అధికారపక్షంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లగానే కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మోహన్‌రెడ్డి హస్తం పార్టీలో చేరడాన్ని తట్టుకోలేని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బండారు మంజుల నడివీధిలో ఆయనను చెప్పుతో కొట్టింది. ఆయన కాంగ్రెస్ చేరకూడదని డిమాండ్ చేశారు. అయితే, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మోహన్ రెడ్డి సమీప బంధువు కావడం గమనార్హం. -
క్షమించండి.. బీఆర్ఎస్ ఖేల్ ఖతం.. సైదిరెడ్డి వ్యాఖ్యలు వైరల్
సాక్షి, హైదరాబాద్: ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. ఇక, బీఆర్ఎస్ పని అయిపోయినట్టే’’ అంటూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వాయిస్ రికార్డ్ వైరల్‌గా మారింది. హుజూర్నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నేరేడుచర్ల ముఖ్య కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇక, ఈ టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ బయటకు వచ్చింది. ఈ సందర్బంగా సైదిరెడ్డి కామెంట్స్ ఇలా ఉన్నాయి.. ‘తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు. పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఆ పార్టీ నేతలు చాలామంది భయపడుతున్నారు. ఢిల్లీకి రావాలని బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. పార్టీలో చేరాలని కోరుతున్నారు. బీజేపీ చేరితే పార్లమెంట్ టికెట్ నీకే ఖరారవుతుందన్నారు. నేను ఎవరితో చెప్పలేదని, కార్యకర్తలతో మాట్లాడాలని చెప్పినా వారు వినిపించుకోలేదు. అమిత్ షా ఆధ్వర్యంలో ఇప్పుడే ఇది పూర్తవుతుంది. ఇప్పుడు నువ్వు కండువా కప్పుకోకపోతే రాష్ట్రంలో బీజేపీ పరువు పోతుందని ఒత్తిడి తెచ్చారు. మీరంతా నా వెంటే ఉంటారు, నన్ను అర్థం చేసుకుంటారని నేను పార్టీ మారాల్సి వచ్చింది. మీకు తెలుసు నేను బీఆర్ఎస్లో చేరినప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది. ఒక్క సర్పంచ్ లేడు. నేను వచ్చాకనే 120 సర్పంచ్‌లు, 17 పీఏసీఎస్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు గెలిపించుకున్నాం. యువతకు ఏమీ చేయలేకపోయానని బాధ ఉంది. ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంది. మళ్లీ మోదీనే వస్తాడు. అప్పుడు మనం యూత్‌కు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు తీసుకురావచ్చు. ఇన్నాళ్ల చరిత్రలో ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న మోదీలాంటి నాయకుడు లేడు. ఒక్క స్కాం లేదు. ఆయనకు కుటుంబం లేదు. దేశమే ఆయనకు కుటుంబం. ఆయన సపోర్టు ఉంటే మనకు మంచి జరుగుతుందనే ఆలోచనలో ఉన్నాను. వాళ్లు నన్ను కావాలని కోరుకోవడం నాకు మంచిదే అవుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ పార్టీ వాళ్లే కోరుకుంటున్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలే వెళ్లి సీఎం రేవంత్‌కు సహాయం చేసే అవకాశం ఉంది. బీజేపీలోకి నేను ఒక్కడినే వెళ్లి ఏంచేస్తాను. నాతోపాటు మీరు కూడా ఉంటే ఏదైనా చేయవచ్చు. బీజేపీలో చేరుతున్నట్టు చెప్పకపోవడం తప్పే, రాష్ట్రంలో టీడీపీ ఖతమైంది. బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు. బీజేపీకి 10 నుంచి 12 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మారకపోతే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందరూ నా వెంట వస్తారని ఆశిస్తున్న. రెండు మూడు రోజుల్లో హుజూర్‌నగర్‌కు వచ్చి మీతో మీటింగ్‌లో మాట్లాడతాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
Telangana Congress: సీటు ఎవరికి ఇద్దాం?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపు కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. మొత్తం స్థానాల్లో నాలిగింటిని ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఈ క్రమంలో మిగతా అభ్యర్థుల ఖరారు కోసం నేడు ఇటు హైదరాబాద్‌లో, అటు హస్తినలో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. మిగిలిన 13 పార్లమెంట్ స్థానాలపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారామె. ఆయా నియోజకవర్గాల వారీగా.. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇతరత్రా నేతలు ఈ భేటీలో పాల్గొంటున్నారు. టికెట్ ఎవరికిస్తే బాగుంటుందనే దానిపై ఒక్కొక్కరి నుంచి విడివిడిగా ఆమె అభిప్రాయం సేకరిస్తున్నారు. ఏఐసీసీ సూచనల మేరకే అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ సమావేశం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ సీఈసీ భేటీ అనంతరం.. మరికొన్ని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 12 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నట్టుగా తాము అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో తేలిందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించినట్టు సమాచారం. బూత్ కమిటీల పనితీరు లోతుగా సమీక్షించి, అవి ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించి లోపాలు, లోటుపాట్లు సరిచేసుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అన్ని పోలింగ్‌బూత్‌లలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజలను కలిసి బీజేపీ, మోదీపాలనపై మద్దతు కూడగట్టి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో విస్తృతంగా పర్యటించేందుకు కార్లు, ఇతర వాహనాలపై ఆధారపడకుండా, ప్రతీరోజు బైక్‌లకు జెండాలు కట్టుకుని ఊరూరా తిరగాలని పిలుపునిచ్చారు. తమ పోలింగ్‌బూత్‌ల పరిధిలో ఇదేవిధంగా పనిచేస్తున్నామని చెప్పారు. వెంటనే ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో 50 మందితో ఒక్కో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తాను ఓ కాన్ఫరెన్స్కాల్తోనే మూడులక్షల మందితో సంభాషించి, పోలింగ్‌బూత్ కమిటీలకు దిశానిర్దేశం చేసినట్టు పార్టీ నేతలకు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఓ స్టార్హోటల్లో పార్టీ ముఖ్యనేతలు, పార్లమెంట్ ప్రభారీలు, కన్వీనర్లు, పార్లమెంట్ పొలిటికల్ ఇన్‌చార్జ్‌లతో అమిత్‌షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయా పోలింగ్‌బూత్‌లలో చేపట్టాల్సిన కార్యాచరణ, సిద్ధం చేసుకోవాల్సిన వ్యూహాలపై రాష్ట్రనాయకులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీనేతలు డా.కె.లక్ష్మణ్, డీకే.అరుణ, ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ రాబోయే రెండునెలలు అన్ని పనులను పక్కనపెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేయాలని చెప్పారు. పార్టీనేతలు మరింత ఎక్కువగా కష్టపడి పనిచేస్తే 12 సీట్లే కాదు 15 స్థానాలు కూడా గెలుచుకునే అవకాశా లున్నాయని తెలిపారు. ఇదేస్థాయిలో పనిచేస్తే 2029లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వచ్చితీరుతుందని నాయకులకు అమిత్‌షా స్పష్టం చేశారు. అమిత్‌షాతో అరూరి రమేశ్ భేటీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అమిత్‌షాతో భేటీ అయ్యారు. కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరి, వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ముందుగా రాష్ట్రపార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాలను కలిసి చేరిక తేదీపై నిర్ణయం తీసుకోవాలని అమిత్‌షా సూచించినట్టు తెలిసింది. త్వరలోనే రమేశ్ బీజేపీలో చేరే అవకాశాలున్నాయని, ఆయనకు వరంగల్ ఎంపీ టికెట్ దాదాపు ఖరారైనట్టేనని పార్టీ వర్గాల సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలిసి ఓ స్టార్ హోటల్లో అమిత్‌షాను కలిసినట్టు సమాచారం. -
ధర్మయుద్ధానికి సిద్ధం కావాలి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే ధర్మ యుద్ధానికి (లోక్‌సభ ఎన్నికలకు) పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని కేంద్రమంత్రి బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అందరూ కష్టపడి పనిచేసి ధర్మం, న్యాయం కోసం కృషిచేస్తున్న మోదీని మరోసారి ప్రధానిని చేయాలని కోరారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ముఠా వందరోజుల్లో రాష్ట్రంలోని బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పరిశ్రమలు, కాంట్రాక్టర్ల దగ్గర రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. ‘మన అందరి ఎజెండా ఒకటే..ఏప్రిల్‌లో జరగనున్న ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలి. గత పదేళ్లలో మోదీ సర్కార్ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. 12 సీట్లు గెలుస్తాం : డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ...‘ఆరు నూరైనా.. తెలంగాణలో 12 సీట్లు గెలుస్తాం, కాషాయ జెండా ఎగరేస్తాం. తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఈసారి మోదీకే ఓటని ప్రజలు చెప్తున్నారు. కాంగ్రెస్ అరుగ్యారంటీలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. తెలంగాణలో 17 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతాడా..? రాహుల్‌ను ప్రధాని అభ్యరి్థగా ఇండియా కూటమే ఒప్పుకోవడం లేదు. రాష్ట్రంలోకాంగ్రెస్ మోసపూరిత పాలనతో ప్రజలు విసుగు చెందుతున్నారు’ అని అన్నారు. బీజేపీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘రాబోయే 40 రోజులు పోలింగ్బూత్లకే కార్యకర్తలు పరిమితమై పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంఐఎంలను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉంది. గ్యారంటీల పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారు’ అని అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ...‘మేము రాముని పేరు చెప్పి బరాబర్ ఓట్లు అడుగుతాం. మీకు దమ్ముంటే బాబర్ పేరు చెప్పి ఓట్లు అడగండి’ అని సవాల్ విసిరారు. ‘అసలు కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరు? ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు చుక్కలు చూపెడతారు. ఒకట్రెండు హామీలు నెరవేర్చి ఎన్నికల కోడ్ వస్తే కాలం గడపొచ్చని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది’ అని అన్నారు. నిజామాబాద్ ఎంపీ అరి్వంద్ ధర్మపురి మాట్లాడుతూ...‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా మోదీకే ఓటేస్తామని జనం అంటున్నారు. వచ్చే నెల, నెలన్నర రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ అత్యధిక సీట్లలో గెలిచేలా కృషిచేయాలి’ అని చెప్పారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులకుప్పగా మారిస్తే, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్ ఉందన్నారు. -
రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సాక్షి, మేడ్చల్ జిల్లా/చార్మినార్: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ఎజెండా ఒక్కటేనని, రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆ మూడు పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలని దుయ్య పట్టారు. మంగళవారం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్‌షా మాట్లాడారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కారు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలన్నారు. బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా అవి పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తానని, దానిపై జవాబు చెప్పిన తర్వాతనే బీజేపీపై విమర్శలు చేయాలని హితవు పలికారు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీ వెళ్లి సేద తీరాల్సిందేనని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.10వేల కోట్లు సాయం చేసిందన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అమిత్‌షా తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా వారియర్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. బీఆర్ఎస్కు సీట్లు వచ్చినా.. రాకున్నా.. రాష్ట్రానికి ఉపయోగం లేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే అది దుర్వినియోగం అవుతుందని చెప్పారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీని మళ్లీ ప్రధాని చేయాలని, మోదీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతీ సోషల్ మీడియా కార్యకర్త అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఒవైసీని ఓడిస్తాం: కిషన్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిస్తేనే.. తెలంగాణలో బలమైన పార్టీగా ఎదగగలదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈసారి హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీని ఓడిస్తామని చెప్పారు. జాతీయ, రాష్ట్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సోషల్ మీడియా వారియర్స్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇతర పార్టీల తప్పుడు ప్రచారాలను ఖండించాలని చెప్పారు. ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, మహేశ్వర్‌రెడ్డి, ఎంవీఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు అమిత్ షా మంగళవారం సాయంత్రం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి, హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవి లత తదితరులు పాల్గొన్నారు. -
వారిది మజ్లిస్ ఎజెండానే: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఎంఐఎం ఎజెండా ప్రకారమే నడుచుకుంటున్నాయని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ మజ్లిస్‌కు భయపడి సభా సంప్రదాయాలు, నియమాలు తోసిరాజని అక్బరుద్దీన్‌ను ప్రొటెమ్ స్పీకర్ చేసిందన్నారు. ఓటుబ్యాంక్ రాజకీయాలకు పాల్పడే ఈ మూడు కుటుంబ పార్టీలు హైదరాబాద్ విముక్తి దినోత్సవాన్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చగలవా అని ప్రశ్నించారు. అవినీతి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవానికి ఏమాత్రం విలువ ఇవ్వవని ఆరోపించారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణ ట్యాగ్‌లైన్ అయిన నీళ్లు, నిధులు, నియామకాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ మొదలు రాహుల్ గాంధీ వరకు, బీఆర్ఎస్ కేసీఆర్ నుంచి కేటీఆర్, ఆ తర్వాతి తరాలు.. ఎంఐఎం బడేమియా అసదుద్దీన్, చోటేమియా అక్బరుద్దీన్ అన్నట్టుగా తమ కుటుంబ ప్రయోజనాలే ధ్యేయంగా పని చేస్తున్నాయన్నారు. రైతులు, ఓబీసీలు, యువత, మహిళలు, పేదల అభ్యున్నతి గురించి ఆ పార్టీలకు ఏమాత్రం పట్టదన్నారు. బీజేపీ, ప్రధాని మోదీతోనే ఈ వర్గాల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని, డెబ్బై ఏళ్ల తర్వాత తెలంగాణను రజాకార్ల చెర నుంచి దూరం చేయగలిగేది బీజేపీ మాత్రమేనని అమిత్‌షా చెప్పారు. మోదీని మూడోసారి ప్రధానిని చేయడం, దేశంలో బీజేపీ 400 సీట్లలో గెలవడం, తెలంగాణలో 12 సీట్లలో విజయం సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలంగాణలో మోదీ పట్ల ప్రజల్లో ప్రేమ చూస్తుంటే వచ్చేసారి 400 సీట్లు ఖాయంగా వస్తాయని అనిపిస్తోందన్నారు. రేవంత్‌కు అమిత్‌షా సవాల్ గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో బొగ్గు, కామన్వెల్త్గేమ్స్, 2 జీ, పంచకుల, అగస్టా విమానాలు ఇలా మొత్తం అవినీతి, కుంభకోణాల్లో మునిగితేలారో, లేదో చెప్పాలంటూ అమిత్‌షా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలో తెలంగాణకు రూ.1.17 లక్షల కోట్లు వస్తే, మోదీ పదేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్లు వచ్చాయని చెప్పారు. రాహుల్‌ను ప్రధాని చేయాలని సోనియా, కేటీఆర్‌ను సీఎంను చేయాలని కేసీఆర్, పశ్చిమబెంగాల్లో తన మేనల్లుడిని సీఎంను చేయాలని మమతా బెనర్జీ, మహారాష్ట్రలో సుప్రియా సూలేను సీఎం చేయాలని శరద్‌పవార్, ఆదిత్యాఠాక్రేను సీఎం చేయాలని ఉద్ధవ్‌ఠాక్రే.. ఇలా కొడుకులు, కుమార్తెలు, అల్లుళ్లను పీఎంలు, సీఎంలు చేయాలని భావిస్తున్నారన్నారు.అవన్నీ సొంత ప్రయోజనాల పరిరక్షణకే పరిమితమైన పార్టీలని, మోదీ ప్రభుత్వం ఇందుకు పూర్తిగా విరుద్ధమని చెప్పారు. బీఆర్ఎస్ను భ్రష్టాచార్ రిష్వత్కోరి సమితిగా అభివర్ణించిన అమిత్‌షా.. ఆ పార్టీ ఓఆర్ఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఢిల్లీ మద్యం కుంభకోణాల్లో వేలకోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అదే సమయంలో 23 ఏళ్లపాటు సీఎంగా, ప్రధానిగా (పదేళ్లుగా) పనిచేసిన మోదీపై 25 పైసల అవినీతికి పాల్పడినట్టుగా కూడా ప్రతిపక్ష పార్టీలు వేలెత్తి చూపలేకపోయాయని చెప్పారు. తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం కోసం శ్రమించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, మహిళలు, ఇతర రంగాల వారిని కలిసి కమలం గుర్తుకు ఓటేసేలా చైతన్యపరచాలని పార్టీ నేతలకు అమిత్ షా పిలుపునిచ్చారు. సీఏఏ.. పౌరసత్వాన్ని ఇవ్వడానికే... దేశంలో కొత్తగా అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో ఎవరి పౌరసత్వం తొలగించబోయేది లేదని అమిత్‌షా స్పష్టంచేశారు. ఈ చట్టం అమలుకు సంబంధించి తప్పుడు ఆరోపణలతో కొందరు కేంద్రంపై, బీజేపీపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏ పౌరసత్వాన్ని ఇచ్చేదే తప్ప తొలగించేది కాదన్నారు. దీని ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ వంటి దేశాల నుంచి భయంతో భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్దులకు మనదేశ పౌరసత్వం ఇస్తామని చెప్పారు. కొన్ని పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయని, వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించి లోక్‌సభ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసేలా నేటి నుంచే ప్రచారం మొదలుపెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇప్పటికే 9 లోక్‌సభ స్థానాలకు ప్రకటించిన పార్టీ అభ్యర్థులు.. జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బండిసంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), బీబీ పాటిల్ (జహీరాబాద్), పి,భరత్‌ప్రసాద్ (నాగర్‌కర్నూల్), మాధవీలత (హైదరాబాద్)లను సభికులకు అమిత్‌షా పరిచయం చేశారు.