గూగుల్‌ పిక్సెల్‌ 2 : కమింగ్‌ సూన్‌


సాక్షి, న్యూఢిల్లీ:  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గూగుల్‌  మరో రెండు పిక్సెల్‌  స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌ డేట్‌  వచ్చేసింది. మేడ్‌  బై గూగుల్‌  వెబ్‌సైట్‌ అందించిన సమాచారం అక్టోబర్‌ 4వ తేదీన  గూగుల్‌  కొత్త పిక్సెల్‌ 2, పిక్సెల్‌  2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌పోన్లను  లాంచ్‌ చేయనుంది.  విజయవంతమైన పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ ఎల్ స్మార్ట్ ఫోన్లకు సక్సెసర్ గా   వీటిని వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.


ముఖ్యంగా  ప్రత్యర్థి  మొబైల్‌ దిగ్గజాలు శాంసంగ్‌, ఆపిల్‌  తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయడంతో గూగుల్‌ కూడా ఇదే సరైన సమయంగా భావిస్తోంది.  గూగుల్‌ బోస్టన్‌ బిల్‌బోర్డ్‌ ట్వీట్‌ చేసిన వీడియో ప్రకారం  ఈ డివైస్‌లను స్మార్టర్‌ గూగుల్‌ అసిస్టెంట్‌ ఇంటిగ్రేషన్ తో రూపొందించింది  అలాగే  రెండు మోడల్స్‌లోను అల్యూమినియం, గ్లాస్‌ ప్యానెల్‌,  ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, స్టీరియో  స్పీకర్స్‌,  వాటర్‌ ప్రూఫ్‌  తదితర ఫీచర్లతోపాటు.. హెడ్‌ ఫోన్‌జాక్‌ ఉండదని తెలిపింది.


అంతేకాదు  బ్యాటరీ లైఫ్‌, నిల్వ, ఫోటో క్లారిటీ, ఆటోమేటిక్ అప్‌డే ట్స్,  పెర్‌ఫామెన్స్‌, ఓవర్‌హీట్‌ తదితర అంశాల్లో  గ్రేటర్‌ ఫెర్‌ఫామెన్స్‌ హింట్స్‌ కూడా ఇచ్చేసింది.  వివిధ  స్టోరేజ్ వేరియంట్లతో ఇది లభ్యంకానుందని, దాదాపు  పిక్సెల్‌స్మార్ట్‌ఫోన్‌ ధరకు చేరువలోనే ఈ కొత్త డివైస్‌​ ధర కూడా నిర్ణయించనుందని  అంచనా.ఇ ప్పటికే  సంస్థ ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వానాలను కూడా మీడియాకు పంపిందట.


కాగా  గూగుల్ తన సొంత బ్రాండులో గత ఏడాది అక్టోబర్‌4న  పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.  సరిగ్గా ఏడాదికి మళ్లీ  కొత్త స్మార్ట్‌ఫోన్లతో  మార్కెట్లో  హల్‌చల్‌ చేయనుంది.



 

Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top