ప్రియుడి ఇంటి వద్ద మౌనదీక్ష | women protest at lover house in kurnool district | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి వద్ద మౌనదీక్ష

May 13 2017 2:20 PM | Updated on Sep 5 2017 11:05 AM

ప్రియుడి ఇంటి వద్ద మౌనదీక్ష

ప్రియుడి ఇంటి వద్ద మౌనదీక్ష

ప్రేమించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. తర్వాత వదిలేసి మోసం చేశాడంటూ ఆర్తి అనే అమ్మాయి ప్రియుడి ఇంటి వద్ద మౌనదీక్ష చేపట్టింది.

మంత్రాలయం: ప్రేమించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. తర్వాత వదిలేసి మోసం చేశాడంటూ ఆర్తి అనే అమ్మాయి ప్రియుడి ఇంటి వద్ద మౌనదీక్ష చేపట్టింది. మంత్రాలయం మండల కేంద్రం రాఘవేంద్రపురంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. ‘అమ్మ, నాన్న శ్రీనివాసతురాయి, సురేఖ తురాయి ఆరేళ్ల క్రితం మంత్రాలయంలో ఉండేవారు. ఆ సమయంలో మంత్రాలయానికి చెందిన మల్లికార్జునగౌడ్‌ కుమారుడు ఈరన్నగౌడ్‌తో పరిచయం ఏర్పడింది. మూడేళ్ల క్రితం మంత్రాలయానికే చెందిన లక్ష్మన్నతో పెళ్లి జరిగింది. అయితే ఈరన్నగౌడ్‌తో ప్రేమ విషయం తెలియడంతో ఏడాదికే భర్త వదిలేశాడు.
 
తర్వాత అమ్మనాన్నతోపాటు ముంబయ్‌లో ఉండేదాన్ని. మూడు నెలల క్రితం ఈరన్నగౌడ్‌ రావడంతో తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. మూడు వారాలు అక్కడే గడిపి 15 రోజుల క్రితం బెంగళూరు వెళ్లాం. వారం తర్వాత మల్లికార్జున గౌడ్‌ వచ్చి ఆదోని తీసుకొచ్చాడు. వారం రోజుల్లో పిలిపిస్తామంటూ నన్ను ముంబయిలో వదిలేసి వచ్చాడు. వారం గడిచినా స్పందన లేకపోవడంతో మూడు రోజుల క్రితం అమ్మతో కలిసి మంత్రాలయం వచ్చాం. ఇంటికి తాళం వేసి వెళ్లడంతో ఇక్కడే కూర్చున్నాం’ అని చెప్పింది. న్యాయం కోసం పోరాటం చేస్తానని, లేదంటే పోలీసులను ఆశ్రయిస్తానని వివరించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement