నగల కోసం దారుణహత్య | women murdered in vijayawada | Sakshi
Sakshi News home page

నగల కోసం దారుణహత్య

Oct 21 2016 12:16 PM | Updated on Aug 30 2018 5:27 PM

బంగారు నగల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హతమార్చిన సంఘటన విజయవాడలోని పాయికాపురంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

విజయవాడ: బంగారు నగల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హతమార్చిన సంఘటన విజయవాడలోని పాయికాపురంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సరోజినిని నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చి ఆమె వంటి మీద ఉన్న నగలతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇంట్లో అద్దెకు ఉండే ఒడిశాకు చెందిన దంపతులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement