శ్రీరాములపేట సమీపంలో అటవీప్రాంతం నుంచి వచ్చిన ఎలుగుబంట్లు బావిలో పడి చనిపోయాయి.
వీణవంక మండలం శ్రీరాములపేట సమీపంలో అటవీప్రాంతం నుంచి వచ్చిన ఎలుగుబంట్లు బావిలో పడి చనిపోయాయి. ఆదివారం రాత్రి
బావిలో ఎలుగుబంట్లు పడినట్లు చెబుతున్నారు. సోమవారం ఉదయం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినా వారు సకాలంలో స్పందించలేదని గ్రామస్తులు తెలిపారు. సోమవారం సాయంత్రం అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది ఎలుగుబంట్లు ఉన్న బావిలోకి నిచ్చెనను దించి వెళ్లిపోయారు. అయితే, బావిలో నీళ్లు ఉండటంతో అవి నిచ్చెన మీదుగా పైకి రాలేకపోయాయి. నీటిలో మునిగి రెండు ఎలుగులు చనిపోగా మరొకటి ప్రాణాపాయ స్థితిలో ఉంది. దీనిని బయటకు లాగిన గ్రామస్తులు వెటరినరీ సిబ్బంది సాయంతో వైద్యం అందిస్తున్నారు.