చేనేత చట్టానికి సవరణ | textiles law amendment | Sakshi
Sakshi News home page

చేనేత చట్టానికి సవరణ

Mar 5 2015 1:35 AM | Updated on Sep 2 2017 10:18 PM

చేనేత చట్టానికి  సవరణ

చేనేత చట్టానికి సవరణ

చేనేత రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేయకపోతే కనీసం సవరణ చేసేలా పార్లమెంట్‌లో చర్చించాలని ఆంధ్ర, కర్ణాటక ప్రాంత .....

ఉభయ రాష్ట్రాల మరమగ్గాల కార్మిక సంక్షేమ పోరాటకమిటీ డిమాండ్
రాష్ట్రపతి మొదలుకుని పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి పయనం

 
దొడ్డబళ్లాపురం :  చేనేత రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేయకపోతే కనీసం సవరణ చేసేలా పార్లమెంట్‌లో చర్చించాలని ఆంధ్ర, కర్ణాటక ప్రాంత మరమగ్గాల కార్మిక సంక్షేమ పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా రాష్ట్రపతి మొదలుకుని పలువురు కేంద్ర మంత్రులను భేటీ అయ్యేందుకు ఈ నెల 8న ఢిల్లీకి వెళ్లనున్నట్లు కమిటీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక కె.ఎం.హనుమంతరాయప్ప స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ నేతలు మాట్లాడారు. 30 సంవత్సరాల క్రింత రూపొందించిన చేనేత రిజర్వేషన్ చట్టం ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం అనువైనది కాదని తేల్చి చెప్పారు. అప్పట్లో ఎటు చూసినా చేనేత మగా ్గలు విరివిగా ఉండేవని గుర్తు చేశారు.

మారుతున్న కా లానుగుణంగా ప్రస్తుతం మరమగ్గాల సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలిపారు. అయితే చేనేత రిజర్వేషన్ చట్టం ప్రకారం నేత వస్త్రాలను మరమగ్గాలపై  తయారు చేయరాదన్న నిబంధన ఉందన్నారు. ఈ చట్టాన్ని అవకాశంగా తీసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు సాగిస్తూ మరమగ్గాల కార్మికులు, యాజమాన్యాల పొట్టగొడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక చేనేత మగ్గాలు మూలనపడుతున్నాయని, ఇలాంటి తరుణంలో మరమగ్గాల నిర్వహణకు అనువైన చట్టాన్ని అమలు చేయాలంటూ రాష్ట్రపతితోపాటు, కేంద్ర మంత్రులు సంతోష్‌కుమార్ గంగ్వార్జీ, అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు, అనంతకుమార్‌లను కలిసి విన్నవివంచనున్నట్లు తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో కమిటీ నేతలు సూర్యనారాయణ, సుబ్రహ్మణి, శ్రీనివాస్, ఎం.పి.నాగరాజు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement