జీరోలా చేస్తున్నారు | TDP MLA Venugopal Reddy comments | Sakshi
Sakshi News home page

జీరోలా చేస్తున్నారు

Feb 6 2017 1:53 AM | Updated on Aug 10 2018 8:23 PM

జీరోలా చేస్తున్నారు - Sakshi

జీరోలా చేస్తున్నారు

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్‌ నియోజకవర్గంలో, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో సింహంలా పనిచేసిన వాడిని

టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి

గుంటూరు(నగరంపాలెం): పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్‌ నియోజకవర్గంలో, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో సింహంలా పనిచేసిన వాడిని అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో వారే సున్నా చేయాలని చూస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అవేదన వ్యక్తం చేశారు. సంస్థాగత ఎన్నికలపై ఆదివారం నిర్వహించిన టీడీపీ నగర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఇతరుల జోక్యం ఎక్కువగా ఉండటం వల్ల పనులు, పార్టీ పదవులు తన ప్రమేయం లేకుండానే కొనసాగుతున్నాయని చెప్పారు.

పేదలు, కార్యకర్తల కోసం చేసిన సిఫార్సులను అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. శత్రువుల కన్నా పార్టీలో ఉన్న మిత్రులతోనే ఎక్కువ నష్టం జరుగుతుందని తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా నగరపాలక సంస్థ ఎన్నికలుగానీ, వక్ఫ్‌బోర్డు, దేవస్థాన కమిటీలు ఏర్పాటు చేయలేకపోవటంలో కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారని తెలిపారు. పార్టీ పదవులతో విజిటింగ్‌ కార్డులు కొట్టించుకొని అమరావతిలో సెటిల్‌మెంట్‌లు చేసుకునేవారు ఎక్కువయ్యారని విమర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement