
తులసి ప్రసాద్
బజార్‌లో చోరీ చేస్తూ పట్టుపడినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
కర్ణాటక, యశవంతపుర : తన మధురమైన స్వరంతో ప్రేక్షకులను రంజింపచేసిన పాపులర్ గాయకుడు తులసి ప్రసాద్ బిగ్ బజార్‌లో చోరీ చేస్తూ పట్టుపడినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మంగళవారం నగరంలోని బిగ్‌బజార్ వెళ్లిన తులసి ప్రసాద్ వస్తువులను జర్కిన్‌లో ఉంచుకొని తనిఖీ సిబ్బందికి పట్టుబడ్డాడు. పెద్ద సంఖ్యలో అభిమానులున్న మీరు ఇలా వ్యవహరించడం సబబు కాదని సిబ్బంది చెప్పి పంపించారు.