మహిళ పోలీసు వద్ద నగదు దోపిడి | Robbery at woman police constable in Tamilnadu | Sakshi
Sakshi News home page

మహిళ పోలీసు వద్ద నగదు దోపిడి

Sep 11 2014 8:32 AM | Updated on Aug 30 2018 5:27 PM

ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ వద్ద నగదు దోపిడీ చేశారు. చెన్నై కీల్పాకం లోటస్ కాలనీకి చెందిన కల్పన (39).

తిరువొత్తియూరు: ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ వద్ద నగదు దోపిడీ చేశారు.  చెన్నై కీల్పాకం లోటస్ కాలనీకి చెందిన  కల్పన (39). ఈమె కీల్పాకం ట్రాఫిక్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్. మంగళవారం రాత్రి పని ముగించుకుని సైకిల్‌పై ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో ఓ ఏటీఎం సెంటర్‌లో రూ.14 వేలను డ్రా చేసుకున్నారు.
 
 తరువాత నగదును, ఏటీఎం కార్డును బ్యాగులో ఉంచి దాన్ని సైకిల్ ముందు  స్టాండులో పెట్టి ఇంటికి బయలుదేరారు. డాక్టర్ మునియప్ప రోడ్డులో వెళుతుండగా వెనుక బైకులో వెంబడించిన ఇద్దరు యువకులు కల్పన సైకిల్‌పై ఉంచిన హ్యాండ్ బ్యాగ్‌ను లాక్కుని పారిపోయారు. దిగ్భ్రాంతి చెందిన కల్పన దీనిపై కీల్పాకం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement