భువనగిరిలో దొంగల బీభత్సం | robberies hulchul in bhuvanagiri | Sakshi
Sakshi News home page

భువనగిరిలో దొంగల బీభత్సం

Feb 8 2017 10:57 AM | Updated on Aug 30 2018 5:24 PM

భువనగిరిలో దొంగలు బీభత్సం సృష్టించారు.

భువనగిరి: భువనగిరిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని జ్యూయెలర్స్‌ వీధిలో మంగళవారం రాత్రి తాళం వేసి ఉన్న బంగారు ఆభరణాల దుకాణాల్లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. కాసోజు శ్రవణ్‌కుమార్‌కు చెందిన గోల్డ్‌షాపులో దొంగలు పడి 4 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలతో పాటు కొత నగదు ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న ఎం. కొండల్‌కు చెందిన నాలుగు తులాల వెండి ఆభరణాలతో పాటు పెద్ద మొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం ఇది గుర్తించిన వ్యాపారులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement