‘నోట్ల రద్దుతో ఎలాంటి ఫలితం లేదు’ | rk roja respond on Demonization effect | Sakshi
Sakshi News home page

‘నోట్ల రద్దుతో ఎలాంటి ఫలితం లేదు’

Dec 4 2016 9:42 AM | Updated on Sep 27 2018 9:08 PM

‘నోట్ల రద్దుతో ఎలాంటి ఫలితం లేదు’ - Sakshi

‘నోట్ల రద్దుతో ఎలాంటి ఫలితం లేదు’

ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ప్రధాని మోదీ పోగొట్టుకున్నారని వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.

తిరుమల: ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ప్రధాని మోదీ పోగొట్టుకున్నారని వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం ఆమె తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నల్లధనాన్ని వెలికి తీయడానికి పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదని ప్రజలు అంటుకున్నారని చెప్పారు.

డబ్బులు దొరక్క సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నోట్ల రద్దుతో ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. బ్యాంకు ముందు మోదీ తన తల్లిని నిలబెట్టారు కానీ అంబానీ లాంటి వారిని నిలబెట్టలేకపోయారని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement