ఆస్తి తగాదా నేపథ్యంలో కృష్ణాజిల్లా నందిగామలో ఓ రిటైర్డు పోలీసు అధికారి హత్యకు గురయ్యాడు.
నడిరోడ్డుపై రిటైర్డు ఎస్సై దారుణహత్య
Nov 15 2016 3:41 PM | Updated on Jul 30 2018 9:16 PM
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో విషాదం చోటు చేసుకుంది. ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ రిటైర్డు పోలీసు అధికారి హత్యకు గురయ్యాడు. ఎస్‌ఐగా పనిచేసి పదవీ విరమణ చేసిన గుంజి వెంకటేశ్వర్లు కుటుంబంతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. తన స్వగ్రామం నందిగామకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఇతనికి ఆస్తి విషయంలో పినతండ్రి కొడుకులతో తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నందిగామలో రోడ్డుపై మాట్లాడుతుండగా కోపంతో పినతండ్రి కొడుకులు గుంజి శ్రీను, అతని ఇద్దరు తమ్ముళ్లు కత్తులతో పొడిచారు. సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటేశ్వర్లు మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన నెల క్రితమే నందిగామకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు.
Advertisement
Advertisement