ఇంకా ధోనీతోనేనా? | Raai Laxmi hates still being linked to Dhoni | Sakshi
Sakshi News home page

ఇంకా ధోనీతోనేనా?

Dec 30 2014 3:32 AM | Updated on Aug 17 2018 5:11 PM

ఇంకా ధోనితో సంబంధం గురించే అడుగుతున్నారా. అలాంటి ప్రశ్నలకు బదులిచ్చి ఇచ్చి బోర్ కొడుతోంది అంటోంది రాయ్‌లక్ష్మిగా

ఇంకా ధోనితో సంబంధం గురించే అడుగుతున్నారా. అలాంటి ప్రశ్నలకు బదులిచ్చి ఇచ్చి బోర్ కొడుతోంది అంటోంది రాయ్‌లక్ష్మిగా పేరు మార్చుకున్న లక్ష్మీరాయ్. నిజంగానే అలాంటి ప్రశ్నలు మీడియా వాళ్లు అడుగుతున్నారా లేక తనే ప్రచారం చేసుకుంటుందో తెలియదు గానీ, తాజాగా మరోసారి భారత క్రికెటర్ ధోనీ ప్రస్తావన తీసుకొచ్చింది. పైగా మీడియాపై ఆరోపణలు గుప్పించే ప్రయత్నం కూడా చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలంతగా లేవు. దీంతో ఏదో విధంగా ప్రచారంలో ఉంటూ దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించాలనే తాపత్రయంగా చూడాల్సి వస్తోంది.
 
 ఇంతకీ ఈ సంచలన నటి ఏమంటారంటే మీడియా తననింకాధోనీతో కలుపుతూ ప్రచారం చేస్తోందని అంది. ఇది నిజంగా బాధాకరమైన విషయం అని ధోనితో ఐదేళ్ల ముందు తనకు స్నేహం వున్న మాట నిజమేనంది. అయితే ఆ తరువాత ఆయన పెళ్లి చేసుకున్నారని చెప్పింది. ఇప్పటికీ తనపై ధోనికి, ఆయనపై తనకు గౌరవం ఉందని పేర్కొంది. ధోని తరువాత మరో నలుగురితో సంబంధాలు అంటగడుతూ ప్రచారం చేశారని అలాంటిది ఇప్పుడు మళ్లీ ధోనీతో కలిపి రాయడం ఏమిటని ప్రశ్నిస్తోంది. ఆ మధ్య ఒక వ్యాపారవేత్తను ప్రేమించానని అయితే ఆ ప్రేమ ముగిసిపోయిందని చెప్పింది. ప్రస్తుతం తన దృష్టిఅంతా నటనపైనే అని రాయ్‌లక్ష్మి అంటోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement