సర్కార్ విఫలం | Prahlad Joshi Uproar on govt | Sakshi
Sakshi News home page

సర్కార్ విఫలం

Oct 29 2014 3:14 AM | Updated on Mar 29 2019 9:24 PM

సర్కార్ విఫలం - Sakshi

సర్కార్ విఫలం

రాష్ట్రంలో శాంతి, భద్రతలను కాపాడడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి విమర్శించారు.

రాష్ర్టంలో శాంతిభద్రతలు కరువు
హోం శాఖ మంత్రి రాజీనామా చేయాలి
ప్రహ్లాద్ జోషి ధ్వజం


బెంగళూరు : రాష్ట్రంలో శాంతి, భద్రతలను కాపాడడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని  బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి విమర్శించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారమిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న నేరాలు అందరినీ భయాందోళనల్లోకి నెట్టేస్తున్నాయని మండిపడ్డారు. ఇక చెరుకు రైతుల సమస్యను పరిష్కరించడంపై సైతం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.

ఆయా రాష్ట్రాల్లో బీజేపీ స్థితిగతులపై చర్చించడంతో పాటు సభ్యత్వ నమోదును పెంచడంపై చర్చించేందుకు గాను  బుధవారం 13 రాష్ట్రాల బీజేపీ శాఖల అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు ఇతర పదాధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు   వెల్లడించారు. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్ రావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement