సీఎంకు జైలు ఖాయం.... | Prahlad Joshi flays siddaramaiah for taking on Narendra modi, amit shah | Sakshi
Sakshi News home page

సీఎంకు జైలు ఖాయం....

Aug 19 2014 10:14 AM | Updated on Aug 15 2018 2:20 PM

సీఎంకు జైలు ఖాయం.... - Sakshi

సీఎంకు జైలు ఖాయం....

బెంగళూరు అర్కావతి లే అవుట్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు జైలు శిక్ష...

బెంగళూరు : బెంగళూరు అర్కావతి లే అవుట్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు జైలు శిక్ష తప్పదని బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి జోస్యం చెప్పారు. అర్కావతి లే అవుట్ అక్రమాలపై తమ వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ విపక్షనేత జగదీష్ శెట్టర్ పేర్కొంటున్నప్పటికీ సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించటం లేదని ఆయన ప్రశ్నించారు.

వాస్తవాలు వెలుగు చూస్తే తనకు జైలుశిక్ష తప్పదని తెలుసుకునే సీబీఐ దర్యాప్తుకు ముఖ్యమంత్రి వెనుకంజ వేస్తున్నారని ప్రహ్లాద జోషి ఎద్దేవా చేశారు. తన కుమారుడితో ఇసుక మాఫియాను నడుపుతున్న ముఖ్యమంత్రికి ప్రధాని నరేంద్ర మోడిని, అమిత్ షాను  విమర్శించే అర్హత లేదన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా బళ్లారిలో అధికార దుర్వినియోగానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement