విమానాశ్రయంలో బంగారం స్వాధీనం | Person travelling from Dubai caught at Mumbai Airport with 350 gm gold sheets | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో బంగారం స్వాధీనం

Sep 16 2016 7:57 PM | Updated on Sep 4 2017 1:45 PM

విమానాశ్రయంలో బంగారం స్వాధీనం

విమానాశ్రయంలో బంగారం స్వాధీనం

దుబాయ్ నుంచి ముంబై వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద విమానాశ్రయంలో 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ముంబై: దుబాయ్ నుంచి ముంబై వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద విమానాశ్రయంలో 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ప్రయాణికుడి వద్ద ఉన్న అల్యూమినియం రేకును  పరిశీలించగా అందులో బంగారం ఉన్నట్లు గుర్తించారు.

పలుచని బంగారం రేకులని ప్యాకింగ్కు వినియోగించే అల్యూమినియం షీట్ లో ఉంచి తీసుకెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని వెల్లడించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు సదరు వ్యక్తిని విచారిస్తున్నారు. తనిఖీల్లో అల్యూమినియంగా భావించేలా బంగారాన్ని అల్యూమినియం షీట్లలో కూర్చి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement