హగరినదిలో ఇసుక తవ్వకాల వల్ల కేవలం కాంట్రాక్టర్లకు మాత్రమే లాభాలు వస్తున్నాయని, అయితే నది పరివాహక గ్రామాలకు చెందిన ప్రజలకు ఎలాంటి మేలు చేకూరడం లేదని బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శనివారం కుంటనహాల్ గ్రామంలో శాంతి సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
సాక్షి, బళ్లారి :
హగరినదిలో ఇసుక తవ్వకాల వల్ల కేవలం కాంట్రాక్టర్లకు మాత్రమే లాభాలు వస్తున్నాయని, అయితే నది పరివాహక గ్రామాలకు చెందిన ప్రజలకు ఎలాంటి మేలు చేకూరడం లేదని బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శనివారం కుంటనహాల్ గ్రామంలో శాంతి సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నదీ తీర ప్రాంతంలో సాగిస్తున్న ఇసుక తవ్వకాల వల్ల గ్రామస్తులకు భయానక వాతారణం నెలకొనకూడదన్నారు. బీజేపీ నాయకుడు గాదిలింగప్ప, మాజీ ఎంపీ కేసీ కొండయ్య అనుచరుడు ప్రకాష్, మాజీ మంత్రి అల్లం వీరభద్రప్ప అనుచరుడు తగలి వెంకటేష్ తదితరులు నియమాలను ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. నేరుగా నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టి బెంగళూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. ఇసుక కాంట్రాక్టర్లు నియమాలను గాలికి వదిలి ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. సాధ్యమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్రమ ఇసుక తవ్వకాలను సాగించకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, అసెంబ్లీలో కూడా లేవనెత్తుతానన్నారు.
కుంటనహాల్‌లో శాంతి సభ
బళ్లారి తాలూకాలోని హగరి నదిలో అధికారుల నిర్లక్ష్యంతో ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతుండటంతో కుంటనహాల్ ఘటన చోటు చేసుకుందని బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.శ్రీరాములు పేర్కొన్నారు. నాలుగు రోజులుగా కుంటనహాల్-తలమామిడి గ్రామాల మధ్య అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్న వారిపై పోలీ సులు దాడి చేయడంతోపాటు పలువురిని అరెస్ట్ చేశారన్నారు. దీంతో కుంట నహాల్‌లోని విఘ్నేశ్వర దేవస్థానంలో శ్రీరాములు శాంతి సమావేశం ఏర్పా టు చేశారు. పోలీసులు మఫ్టీలో వచ్చినందునే ఇసుక తవ్వకందారులు, పోలీ సుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందన్నారు. ఇలాంటి ఘటనలు మున్ముం దు జరగకుండా చూడాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అనుమతి పొందిన వాహనాలలో ఇసుకను తరలించాలని సూచించారు. కుంటనహాల్ గ్రామంలో అధికారుల తీరు వల్ల అమాయక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని పోలీసులు, ఇతర అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.