43 లక్షల విలువైన ఏనుగు దంతాలు స్వాధీనం | One arrested with elephant tusk worth Rs 43 lakh | Sakshi
Sakshi News home page

43 లక్షల విలువైన ఏనుగు దంతాలు స్వాధీనం

Aug 9 2014 8:47 AM | Updated on Sep 2 2017 11:38 AM

ఏనుగు దంతాలను విక్రయించడానికి యత్నించిన వ్యక్తిని ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగళూరు: ఏనుగు దంతాలను విక్రయించడానికి యత్నించిన వ్యక్తిని ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... తమిళనాడులోని ఈరోడ్కు చెందిన పోచియప్పన్ గురువారం రాత్రి యశ్వంతపురం సమీపంలోని మారప్పనపాళ్యలో ఎనిమిది కేజీలకు పైగా బరువున్న ఏనుగు దంతాలను విక్రయించడానికి యత్నించాడు. గస్తీ పోలీసులకు అనుమానం వచ్చి అతడి వద్ద బ్యాగులను తనిఖీ చేశృ఼రు.

బ్యాగ్లోని విలువైన ఏనుగు దంతాలు బయటపడటంతో అతన్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడులో ఏనుగులను చంపి దంతాలను తీసుకు వచ్చి బెంగళూరులో విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించడాని పోలీసులు తెలిపారు. ఈ దందాలో ఎంత మంది ఉన్నారలో ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement