ప్రాచీన గ్రామ క్రీడలతో చిత్రం
కబడ్డీ గోలీలు, బొంగరం ఆటలను గ్రామాల్లో ఇప్పటికీ అక్కడక్కడా చూస్తుంటాం. అయితే ప్రాచీన క్రీడలైన ఇవి నానాటికీ తెరమరుగ
కబడ్డీ గోలీలు, బొంగరం ఆటలను గ్రామాల్లో ఇప్పటికీ అక్కడక్కడా చూస్తుంటాం. అయితే ప్రాచీన క్రీడలైన ఇవి నానాటికీ తెరమరుగ వుతున్నాయన్నది నిజం. వాటి స్థానంలో క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్ లాంటి క్రీడలు ఆధునిక ప్రచార సాధనాలు టీవీ, ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్‌లతో అత్యధిక ప్రాచుర్యంలోకి వచ్చాయి. మరచిపోతున్న మన గ్రామీణ క్రీడలను గుర్తు చేసే విధంగా కబడ్డీ, గోలీలు, బొంగరం ఆటల ఇతివృత్తంతో తెరకెక్కించనున్న చిత్రం గిల్లీ బొంబరం గోలి అని ఆ చిత్ర దర్శకుడు మనోహరన్ తెలిపారు. ఇంతకుముందు అంజలి, నాజర్ ప్రధాన పాత్రలో నటించిన మహరాజ చిత్రాన్ని తెరకెక్కించిన ఈయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం గిల్లీ బొంబరం గోలి.
శ్రీ సాయి ఫిలిం సర్క్యూట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో నరేష్, ప్రసాద్, తమిళ్ నాయకులుగాను, దీపై శెట్టి నాయకిగాను పరిచయమవుతున్నారు. సంతోష్‌కుమార్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో గంజాకరుప్పు, తలైవాసల్ విజయ్ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవం సోమవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో వినాయక ఆలయం వద్ద జరిగాయి. ఎడిటర్ మోహన్ జాక్వర్ తంగం, గీత రచయిత స్నేహన్ తదితర సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
చిత్ర దర్శకుడు మనోహరన్ చిత్ర వివరాలు తెలుపుతూ కబడ్డీ, గోలీలు, బొంగరం క్రీడల్లో మంచి నైపుణ్యం పొందిన నలుగురు యువకులు వృత్తి రీత్యా మలేషియా వెళతారన్నారు. అక్కడ వారు ఎదుర్కొన్న ఒక సమస్య నుంచి ఈ క్రీడల ద్వారా ఎలా బయటపడగలిగారన్న పలు ఆసక్తి కరమైన సంఘటనలు ఇతివృత్తంగా ఈ గిల్లీ, బొంగరం, గోలి చిత్రం ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ మొత్తం మలేషియా దాని చుట్టుపక్కల దేశాల్లో ఒక షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి వైఆర్ ప్రసాద్ సంగీతాన్ని, నాగకృష్ణన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారని దర్శకుడు వెల్లడించారు.


