దక్షిణాది రాష్ట్రాల్లో పేలుళ్ల కుట్ర భగ్నం | NIA officials nabbed six ISIS Sympathizers | Sakshi
Sakshi News home page

దక్షిణాది రాష్ట్రాల్లో పేలుళ్ల కుట్ర భగ్నం

Oct 2 2016 11:24 PM | Updated on Oct 17 2018 5:14 PM

భారత్‌ సర్జికల్‌ దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్రను ఎన్‌ఐఏ అధికారులు భగ్నం చేశారు.

చెన్నై: భారత్‌ సర్జికల్‌ దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులు.. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు భగ్నం చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం ఆరుగురు ఐసిస్‌ సానుభూతిపరులను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. తెలంగాణ, న్యూఢిల్లీ, కేరళ నిఘావర్గాల సహకారంతో ఎన్‌ఐఏ సానుభూతిపరులను అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది.

అరెస్ట్‌ అయిన ఐసిస్‌ సానుభూతిపరుల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన అబు బషీర్‌ (29), మహమ్మద్‌ (26), కేరళకు చెందిన మన్సీద్‌ (30), జాసిమ్‌ (25), ఖాన్‌ (24) ఉన్నారు. ఎన్‌ఐఏ అధికారులు వారిని విచారిస్తున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement