మెడికల్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు
తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ కౌన్సిలింగ్ విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది.
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ కౌన్సిలింగ్ విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. కౌన్సిలింగ్ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగిస్తూ కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది.
ఎంసెట్ కౌన్సిలింగ్ను మరో నెల రోజులు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణకు గడువు పెంచితే తమకు సమయం ఇవ్వాలని ఏపీ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ మేనేజ్మెంట్ అసోషియేషన్స్ కోర్టును కోరింది. దీనిపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నెల రోజుల గడువు పెంచేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ అక్టోబర్ 7 వరకు పొడిగించింది.