మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు.
మంత్రాల నెపంతో వృద్ధుడి దారుణ హత్య
Dec 19 2016 2:30 PM | Updated on Jul 30 2018 9:16 PM
తిరుమలాయపాలెం: మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామానికి చెందిన పేర్ల ముత్తయ్య(60)ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది చంపారు. సోమవారం విషయం వెలుగులోకి రావటంతో సిబ్బందితో కలసి డీఎస్పీ సంఘటనా స్థలికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. గ్రామానికి చెందిన వారే అతడిని చంపారని తేలటంతో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement