ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒక లారీ కాలిపోయింది.
నిమ్మకాయల లారీలో మంటలు
Oct 17 2016 10:49 AM | Updated on Sep 5 2018 9:47 PM
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒక లారీ కాలిపోయింది. ఆదిలాబాద్ వైపు నుంచి నిర్మల్ వెళ్తున్న నిమ్మకాయల లోడ్ లారీలో నేరడిగొండ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.అవి వేగంగా లారీ అంతటా వ్యాపించటంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.అనంతరం లారీ అగ్నికి ఆహుతయింది. కారణాలు తెలియాల్సి ఉంది. లారీడ్రైవర్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Advertisement
Advertisement