'భూ దందాలకు పాల్పడుతున్న లోకేష్' | gudivada amarnath takes on nara lokesh | Sakshi
Sakshi News home page

'భూ దందాలకు పాల్పడుతున్న లోకేష్'

Oct 5 2016 11:26 AM | Updated on Aug 29 2018 3:37 PM

'భూ దందాలకు పాల్పడుతున్న లోకేష్' - Sakshi

'భూ దందాలకు పాల్పడుతున్న లోకేష్'

నారా లోకేష్పై విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు అమర్నాథ్ నిప్పులు చెరిగారు.

విశాఖపట్నం : ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. బుధవారం విశాఖపట్నంలో గుడివాడ అమర్నానాథ్ విలేకర్లతో మాట్లాడుతూ... జిల్లాలో నారా లోకేష్ భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

సర్క్యూట్ హౌస్ సమీపంలో వెయ్యి కోట్ల విలువైన భూములు నారా లోకేష్ కబ్జా చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement