కుటుంబం సజీవ దహనం | Fire kills four in New Delhi’s Seemapuri | Sakshi
Sakshi News home page

కుటుంబం సజీవ దహనం

Jul 7 2017 8:10 PM | Updated on Sep 5 2018 9:47 PM

తూర్పు ఢిల్లీ ప్రాంతం డిల్షాద్‌ కాలనీలోని ఓ రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది.

న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీ ప్రాంతం డిల్షాద్‌ కాలనీలోని ఓ రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గురుతేజ్‌ బహదూర్‌ ఆసుపత్రికి తరలించారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఫోరెన్సిక్‌ సిబ్బంది విచారణలో భాగంగా సంఘటనాస్థలం నుంచి సాంపిళ్లను సేకరించారు. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement